22.9 C
hyderabad,telangana
August 11, 2020
Global Green News
National Regional Telangana Trending

‘అన్నపూర్ణ’ తెలంగాణలో బియ్యం కొరత… చౌక దుకాణాలు మూసివేత…  తిండి గింజలకు నోచుకోని అభాగ్యులు

కరోనా విపత్తు సమయంలో నిరుపేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా ప్రభుత్వ జాతీయ ఉత్పత్తి పంపిణీ పధకం చౌక ధరల దుకాణాల ముందు బియ్యం నోస్టాక్ బోర్డులు వేలాడదీసి మూసి వేయడం ‘అన్నపూర్ణ తెలంగాణ’ కు సిగ్గు చేటు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా ఏప్రిల్ నెలకు సంభందించి 36 కేజీల ఉచిత బియ్యాన్ని రెండు దినాల పాటు ఇచ్చినట్టే మూడో రోజు నోస్టాక్ బోర్డులు పెట్టి దుకాణాలను మూసివేశారు. దీనితో నిత్యావసర సరుకులు అందక తెలుపు రేషన్ కార్డుదారుల పస్తులు తప్పడంలేదు. హైదరాబాద్ నగరంలో ఏమూల చూసిన ఇదే పరిస్థితి. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని 672, 762 నెంబర్లు గల జాతీయ చౌక ధరల దుకాణాలు రైస్ నోస్టాక్ బోర్డులు అతికించి మూసివేశారు.

రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అందర్నీ ఆదుకునే విధంగా చూడాలని, పస్తులుండే పరిస్థితే లేకుండా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించినప్పటికీ తగిన బియ్యం నిల్వలు సమకూర్చడంలో అధికారులు విఫలమైయ్యారు. నిత్యావసర సరుకుల కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ అధికారులకు పట్టకపోవడం శోచనీయం.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ ) ద్వారా పంజాబ్ నుండి 46% మేర 7.73 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్టాలకు సరఫరా చేసింది.దీనిలో భాగంగా తెలంగాణకు 2.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సమకూర్చడం జరిగింది. అయినప్పటికీ బియ్యం నిల్వలు లేక చౌక దుకాణాల ఎదుట రైస్ నోస్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంలో దాగివున్న మర్మం అధికారులకే ఎరుక.

కరోనా భయాందోళనలు,లాక్ డౌన్ ల పేరిట నిరుపేదలు తిండిగింజలకు నోచుకోక అలమటిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సీఎం కేసీఆర్ మాటను మన్నించి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణి చేసి ఆదుకోవాలని నిరుపేదలు కోరుతున్నారు.

Related posts

సింగరేణి ఆధ్వర్యంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

admin

India now in leadership role in Tiger Conservation: Prakash Javadekear

admin

ఆయన సందేశం…  సతతం హరితం…

admin

Leave a Comment

AP And Telangana Breaking And Live News