Take a fresh look at your lifestyle.

అవినీతి రహిత ‘అటవీశాఖ’ ఆయన ధ్యేయం… ఉత్తమ పిసీసీఎఫ్ గా ప్రతీప్ కుమార్… ఏడాదిలో ఎంతో పురోభివృద్ధి…

0 1,068

నేనున్నాను … అంటూ…

‘నిజాయితీగా పనిచేసుకుంటూ పోతే ఫలితాలు వాటంతటవే వస్తాయి’ అనే సూత్రాన్ని నమ్మి నిబద్ధతతో పనిచేస్తూ… అదే అంకిత భావంతో సిబ్బంది చేత సేవలు అందిస్తూ ‘అవినీతి రహిత అటవీశాఖ’ గా తీర్చిదిద్దిన ఘనతను సొంతం చేసుకున్నారు ఏపీ పిసీసీఎఫ్ ప్రతీప్ కుమార్. గత ఏడాది ఇదే నెలలో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టి అటవీశాఖకు కార్పొరేట్ శోభను సంతరించి తొలి ఏడాదిలోనే సక్సెస్ కు సంకేతంగా నిలిచారు. పిసీసీఎఫ్ గా ఏడాది కాలంలో సాధించిన ప్రగతి ఆయన మాటల్లో…  

2019 సెప్టెంబర్ 16వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి,  సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఎన్. ప్రతీప్ కుమార్ ను రాష్ట్ర అటవీ దళాధిపతిగా నియమించారు. అదే అవకాశంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిపార్టుమెంట్ పరంగా నెలకొన్న సమస్యలపై దృష్టిపెట్టారు. దాదాపు ఐదు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా  పని చేస్తున్న బేస్ క్యాంపు వాచర్సు. స్ట్రయికింగ్ ఫోర్సు,చెక్ పోస్ట్ లలో పని చేసే సిబ్బంది తదితర ఉద్యోగులకు 2019 నుండి ఆగష్టు వరకు పెండింగ్ లో గల వేతనాలను ఒకే సారి చెల్లించారు. అదే విధంగా కొల్లేరు వన్యప్రాణి సంరక్షణా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులకు   ఏడాది నుండి వేతనాలు అందడం లేదని వారు విన్నవించు కోవడంతో వారి వేతనాలు కూడా ఒకే సారి చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా ఈ ఏడాది పొరుగు సేవల కింద పనిచేస్తున్న దాదాపు 2000 మంది ఉద్యోగుల వేతనాలు పెండింగ్ లో ఉండడంతో సీఎం,మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించారు. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందితోనే పనులు వేగవంతం చేయిస్తూ ఎక్కడా శాఖకు సంబందించిన పనులు పెండింగ్ లో లేకుండా చేసుకోగలిగారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరించి నేనున్నాను అంటూ భరోసా నిచ్చారు. మీరు నిజాయితీతో పని చేయండి అని వారిలో మనో ధైర్యాన్ని నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అటవీ కార్యాలయాల బయట

ఇక్కడ అవినీతి రహిత పాలన జరుగుతుంది. మీ పనులు సకాలంలో ఎలాంటి లంచం తీసుకోకుండా పనులు చేయబడతాయి.’

అని బోర్డులు పెట్టించి మరీ సిబ్బంది మన్ననలు పొందారు. సిబ్బంది సంరక్షణ,వారికి కావలిసిన సౌకర్యాలు సమకూర్చిన అనంతరం అటవీ అభివృద్ధి, అటవీ సంపదను పరిరక్షించడం, వన్య ప్రాణుల సంరక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు తాము చేపడుతున్న చర్యలు ముఖ్యమంత్రి కార్యాలయం, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిల దృష్టికి తీసుకు వెళ్లి వారి అనుమతితో అభివ్తుద్ది పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

సీఎం జగన్ ఆశయాల మేరకు ముందుగా గ్రీన్ కవర్ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే 23% ఉన్న గ్రీన్ కవర్ ను 33%కు పెంచాలని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గత ఏడాది ఫారెస్ట్ సర్వే అఫ్ ఇండియా భారత దేశ వ్యాప్తంగా గ్రీన్ కవర్ పెంపులో ఏపీ రెండవ స్థానాన్ని నిలిచిందని ఆస్థానాన్ని మరింత మెరుగు పడేలా ఉండాలని సిబ్బందికి తరుచు సమాయత్త పరుస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు,స్వచ్ఛంద సంస్థలు,ప్రజలు,ఎన్జీఓల సహకారంతో 1671 కోట్ల మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం బయట,లోపల గ్రీన్ కవర్ పెంపు కోసం గ్రామ కార్యదర్శుల,వాలంటీర్ల సహకారం తీసుకున్నారు.

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పేద ప్రజలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత గృహ సముదాయాల వద్ద మొక్కలు నాటించి గ్రీన్ కవర్ పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎర్ర చందనం పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఏడాది అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలిస్తున్న స్మగ్లర్ల పై 544 కేసులు నమోదు చేసి 1119 మందిని అరెస్ట్ చేశారు. వారి నుండి 252 మెట్రిక్ టన్నుల కలపను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల బారి నుండి ఎర్ర చందనంతో పాటు అటవీ సంపదను పరిరక్షించడానికి ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ వారికి సూచనలు,సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నారు.

రాష్ట్రంలో వన్య ప్రాణుల సంరక్షణకు ఒక ప్రణాలికను సిద్ధం చేసుకుని అధికారులు పనిచేసే విధంగా చేశారు. భారత దేశ అడవులలో సహజ సంపద అయిన వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి సంఖ్యను పెంచడం, అంతరించి పోతున్న జంతువులను కాపాడడం ముఖ్య ఉద్దేశ్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వన్య ప్రాణుల రక్షణకు, జాతీయ పార్కుల అభివృద్ధికి ఈ ఏడాది  రూ. 2958 కోట్ల ఖర్చు చేయడం జరిగింది. క్రూర మృగాలా దాడిలో గాయపడిన వారికి నష్ట పరిహారంగా  రూ. 1.6 కోట్లు చెల్లించారు. రాష్ట్రంలో 29 ఎకో టూరిజం కేంద్రాలు,23 నగర వనాల అభివృద్ధి కొరకు  రూ. 8.09 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలో ఖర్చు చేయడం జరిగింది.

అదే విధంగా వన్య ప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పులుల సంరక్షణకు,వాటి పెంపునకు శాస్త్రీయ విధానాలను అవలంభించడం జరుగుతోంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల కదలికలను ఎప్పిటికప్పుడు కెమెరాల ద్వారా కనుగొనడం జరుగుతోంది. శ్రీశైలం నుండి శేషాచలం కొండల వరకు అభయారణ్యాలలో సంచరిస్తున్న పులుల సంఖ్యను, వాటి కదలికలను కూడా కెమెరాలలో బంధించడం జరుగుతుంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు కావడంతో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆదిమ స్థానిక చెంచు తేగలు పులుల యొక్క రక్షణ,పరిరక్షణ ప్రయత్నాలలో గొప్ప పాత్ర పోసించే విధంగా చర్యలు చేపట్టారు.

టైగర్ రిజర్వు నిర్వహణలో స్థానిక చెంచులు పాల్గొని సమర్ధవంతమైన మానవ వనరుల నిర్వహణ అనే ఈ ప్రత్యేకమైన నమూనా భారత ప్రభుత్వం అభినందించడం అటవీశాఖ చేపడుతున్న చర్యలకు నిదర్శనం. అలాగే ఏనుగులను కాపాడటం,జన ఆవాసాల్లోకి వచ్చినపుడు వాటిని తిరిగి అడవుల్లోకి పంపడం,ఈ సందర్భంలో గాయపడిన,పంట నష్టం పై పరిహారం చెల్లించడం తదితర చర్యలు చేపడుతున్నారు. వన్య ప్రాణులను వేటాడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో చాలా వరకు వన్య ప్రాణుల అక్రమ రవాణాను అటవీ అధికారులు అరికట్టగలిగారు. దేశంలో పులులను సంరక్షించడం ద్వారా అటవీ సంపదకు రక్షణగా ఉంటుందని బలంగా నమ్ముతూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.

ఇటీవల అలుగులాంటి అరుదైన జంతువులను విక్రయించే ముఠాలను గుంటూరు,గిద్దలూరు తదితర ప్రాంతాలలో అటవీశాఖ అధికారులు కాపు కాసి పట్టుకున్నారు. చైతన్యం తీసుకువస్తే వన్య ప్రాణుల క్రైమ్ రేట్ తగ్గుతుందని ఆయన సిబ్బందికి చెబుతున్నారు.

ఏపీ లో అటవీ అభయారణ్యాల అభివృద్ధిలో భాగంగా గ్రీన్ కో కంపెనీ తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామం. దినికిగాను రూ.11.61కోట్లు అటవీశాఖకు చెల్లించింది. ఈ విషయంలో అటవీశాఖ ఉన్నతాధికారులు చొరవ అభినందనీయం

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట…..

పిసీసీఎఫ్ బాధ్యతలు చేపట్టి ఉద్యోగుల  సేవలను విస్తృత పరచడంతో పాటు, వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారి సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించారు. ముఖ్యంగా సిబ్బంది కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలు మార్లు  తీసుకు వెళ్లి త్వరలో ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేశారు. మహిళా ఉద్యోగిణిలకు ప్రత్యేక గౌవరం ఇవ్వాలని ప్రతి సమావేశంలో ఉద్భోధ చేస్తూ వారు సక్రమంగా, ఆరోగ్యకర వాతావరణంలో పనిచేసే పరిస్థితులు కల్పించారు. ఎవరి పరిధిలో వారు ఒక టీం లీడర్ గా భావించి పని చేయాలనే పిలుపు నివ్వడంతో ఎవరకి వారు స్వేచ్ఛగా పని చేస్తూ సత్ఫలితాలు రాబట్టారు. అటవీ ఉద్యోగులు యేటా పాల్గొనే  జాతీయ క్రీడా పోటీలకు హాజరయ్యే క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వారికి కావలిసిన స్పోర్ట్సు కిట్లును సమకూర్చడమే కాకుండా సకల సదుపాయాలు కల్పించి ప్రత్యేకత చాటుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.