Take a fresh look at your lifestyle.

ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత

0 25

కొన్ని నెలలుగా రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు గత రాత్రి రాజేంద్రనగర్ సమీపంలో అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. హైదరాబాద్ జూ రెస్క్యూ బృందం దానిని బోనులో బందించి జూ కు తరలించినట్లు శంషాబాద్ ఫారెస్ట్ డివిజినల్ ఆఫీసర్ శివయ్య తెలిపారు.

అటవీ ప్రాంతం నుంచి తప్పి సిటీకి చేరిన చిరుత గత కొన్ని నెలలుగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పరిసర ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికుల సమాచారం మేరకు చిరుతను పట్టుకునేందకుకు అటవీశాఖ సిబ్బంది ఆపసోపాలు గురయ్యారు. అయితే చిరుత తప్పించుకు తిరుగుతుండడంతో దాని విషయం మరుగున పడింది.

కాగా ఉన్నట్టుండి మొన్నటి రాత్రి ఆవుపై దాడి చేసి కలకలం రేపింది. మల్లి చిరుత వ్యహారం తెరపైకి రావడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అది సంచరించే ప్రాంతాల్లోని దాని ఆనవాళ్ల ఆధారంగా గత రాత్రి బోన్ ఏర్పాటు చేసి ఎర వేసి చిరుతను సులువుగా బందించి ఊపిరిపీల్చుకున్నారు. జూ సిబ్బంది సహాకారంతో దానిని జూకు తరిలించారు. పట్టుబడిన చిరుత ప్రస్తుతం జూలో సేద తీరుతోంది.

Leave A Reply

Your email address will not be published.