24.6 C
hyderabad,telangana
August 5, 2020
Global Green News
AP News Regional Trending

       ఏపీ ఆయిల్‌పామ్‌ రైతులకు రూ.87 కోట్లు మంజూరు : మంత్రి  కురసాల కన్నబాబు

వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రి  కురసాల కన్నబాబు మీడియాకి వివరించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రైతులకు సమానంగా ఏపీ ఆయిల్‌పామ్‌ రైతులకు కూడా న్యాయం చేస్తా మన్నారు.  ఆయిల్‌పామ్‌ రైతులు తమ సమస్యను గతంలో వైఎస్‌ జగన్‌ గారి దృష్టికి తీసుకెళ్ళారు. తెలంగాణతో సమానంగా ఇక్కడి రైతులకు రూ.87 కోట్లు మంజూరు చేశా మన్నారు.

మేమంతా స్వయంగా పరిస్ధితిని సమీక్షించాం, నాతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంగారు, డిప్యూటీ సీఎం  ఆళ్ళనాని గారు, స్ధానిక మంత్రులు, శాసనసభ్యులంతా వెళ్ళి అక్కడి రైతులతో స్వయంగా మాట్లాడి ఆ పరిస్ధితిని సీఎంగారికి వివరించాం. పెదవేగి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగిస్తూ నిర్ణ యించారు.

గతంలో చంద్రబాబు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను విక్రయించారు, వాటిని మూసేసిన విషయం కూడా అందరికీ తెలుసు కానీ ఈ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణ రైతులకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యవసాయ చరిత్రలోనే గొప్ప నిర్ణయం, దానికి సంబంధించిన విధివిధానాలు కూడా తక్షణమే రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు

వైఎస్‌ఆర్‌ అగ్రిల్యాబ్స్‌ను ఏర్పాటు

వైఎస్‌ఆర్‌ అగ్రిల్యాబ్స్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో ఈ ల్యాబ్‌లు ఉండాలని సీఎం చెప్పారు. ఒకటి జిల్లా స్ధాయిలో, రెండోది నియోజకవర్గ స్ధాయిలో, గ్రామస్ధాయిలో కూడా భూసార పరీక్షాకేంద్రాలు ఉండాలని సీఎం చెప్పారు, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం, భూసార పరీక్షా కేంద్రాల నమూనాను కూడా సీఎం పరిశీలించారు

విత్తనోత్పత్తిలో రైతుల కు ప్రోత్సాహం

విత్తనోత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని సీఎం చెప్పారు విత్తనాలు పండించేందుకు ముందుకొచ్చే రైతులతో ఏపీ సీడ్స్‌ సంస్ధ ఎంవోయూ చేసుకుంటుంది రైతులనుంచి ఏపీ సీడ్స్‌ స్వయంగా విత్తనాలు కొనుగోలు చేస్తుంది ఆ విత్తనాలను ప్రాసెస్‌ చేసి తిరిగి విక్రయిస్తాం దీనివల్ల రైతులకు అధిక ఆదాయంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయి విత్తన ఉత్పత్తిలో స్వయం సంవృద్ది సాధించేందుకు రాష్ట్రం ముందుకెళుతుంది రాష్ట్రంలో ప్రతి పంట కూడా ఈ క్రాప్‌ బుకింగ్‌లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు అన్ని పంటల పూర్తి డేటా (సర్వే నెంబర్, విస్తీర్ణం)తో సహా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు ప్రతీ గ్రామంలో పంటలు ఈ క్రాప్‌ బుకింగ్‌ చేస్తూ మార్కెటింగ్‌ను పటిష్టం చేసే దిశగా చర్యలు విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లకు అవసరమైన ట్యాబ్‌ లేదా ఫోన్‌ ఇస్తాం, అవసరమైన యాప్స్, టెక్నాలజీని వినియోగిస్తామన్నారు.

27.01 లక్షల హెక్టార్లకు ఇప్పుడు పంటల భీమా

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల భీమా పధకాన్ని రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల భీమా పధకం తీసుకొచ్చాం ఈ పధకానికి మంచి ఆదరణ లభించింది 2018లో 15,50,000 ల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు ఈ ఖరీఫ్‌లో 21.5 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు 18.50 లక్షల హెక్టార్లకు పంటల భీమా గతంలో జరిగింది. ప్రస్తుత సీజన్ లో 27.01 లక్షల హెక్టార్లకు ఇప్పుడు పంటల భీమా జరిగిందన్నారు.

భవిష్యత్‌లో అన్ని పంటలూ భీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు రెండు వేల వాతావరణ పరిశీలనా కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం

రాష్ట్రంలో చిరుధాన్యాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై మిల్లెట్‌ బోర్డు కూడా ఏర్పాటుచేయాలని ఇప్పటికే నిర్ణయించాం ఈ రబీలోనే మిల్లెట్‌లను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఎవరైతే చిరుధాన్యాలు సాగుచేస్తారో వారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు ఆర్గానిక్‌ పంటల సాగును ప్రోత్సహించాలి, వాటికి అధిక ధరలు చెల్లించేలా మార్కెటింగ్‌ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు

వైఎస్‌ఆర్‌ పొలం బడి అనే పేరుతో క్షేత్రస్ధాయిలో రైతులకు వ్యవసాయరంగంలో మెలకువలు, సాగులో కొత్త పద్దతులు నేర్పించడం కోసం ప్రతీ గ్రామంలో రెండు క్షేత్రాలను అభివృద్ది చేసి రైతులకు రెగ్యులర్‌గా శిక్షణనిస్తాం

వ్యవసాయరంగంలో క్షేత్రస్ధాయి అధికారులు ప్రతీ రోజూ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ పొలాల్లోనే ఉండాలి, రైతులతో పాటు కలిసి వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలి.  వారానికి నాలుగు రోజుల పాటు ఫీల్డ్‌లోనే ఉండాలి. రైతుకు అధికారి అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యం

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేలా ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలోనూ ఒక షాప్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయం. 11158 కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఈ షాప్‌ పక్కనే వ్యవసాయ వర్క్‌షాప్‌ ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు వర్క్‌షాప్‌లో ఆధునిక వ్యవసాయ పద్దతులు రైతులకు నేర్పడం, ప్రకృతి సేద్యం, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించడం ఎలా, అధిక ఆదాయ మెలకువలు వంటి కార్యక్రమాలు ఉంటాయి.

రైతులకు ఏ సమస్య వచ్చినా వారు వెంటనే సచివాలయంలో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదుచేసినా అది ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఐటీ సొల్యూషన్‌ సిద్దం చేస్తున్నాం.

పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతులు రుణాలు రీషెడ్యూల్‌ చేయమని అడుగుతున్నారు. దీనిపై సీఎం గారు తక్షణమే సంబంధిత బ్యాంక్‌ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ఇప్పటికే గతంలో నమోదైన 700 కేసులకు గాను 385 కేసులు పరిశీలించాల్సి ఉంది, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సహాయం ఆలస్యం కాకూడదు, వెంటనే ప్రాసెస్‌ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.7 లక్షల చొప్పున ఆర్ధిక సహయం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటికి కలెక్టర్, ఎమ్మెల్యే విధిగా వెళ్ళాలి. ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేయాలో ఈ రోజు శ్రీ వైఎస్‌ జగన్‌ గారు ఆ విధంగా పనిచేస్తున్నారు.

 

Related posts

Coal stocks at power plants up by 77% to 34.25 MT: Pralhad Joshi

admin

Vice President asks ICMR to allay fears about the impact of Coronavirus on the poultry Industry

admin

AP : యూట్యూబ్ ద్వారా పెంగోలియాన్ విక్రయించే ముఠా గుట్టురట్టు చేసిన అటవీశాఖ అధికారులు : సిబ్బందిని అభినందించిన పిసీసీఎఫ్

admin

Leave a Comment

AP And Telangana Breaking And Live News