Take a fresh look at your lifestyle.

కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ అక్రమ తవ్వకాలపై పూర్తిస్థాయి విచారణ…  

0 119

అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు : అటవీశాఖ హెచ్చరిక

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కృష్ణా జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు. మట్టి తవ్వకాలు జరిగిపిన ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు  పేర్కొన్నారు. వీటిపై ప్రాధమిక విచారణ, గుగూల్ ఇమేజ్ లను పరిశీలించడం జరిగిందని, వీటి ద్వారా ఆ ప్రాంతంలో 2014 నుంచి 2018ల మధ్య అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిగినట్టు ధ్రువీకరించడం జరిగిందన్నారు.

మైనింగ్,ఇతర శాఖ సహకారంతో ఈ ప్రాంతంలో అక్రమంగా ఏ మేరకు మట్టి తవ్వకం జరిగింది అంచనా వేసే కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. అంతే కాకుండా కొండపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన అక్రమ తవ్వకాలపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంటూ ముఖ్యంగా 2014 నుంచి 2018 వరకు పెద్దమొత్తంలో అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు.  సంబంధిత శాఖల సహకారంతో పూర్త స్థాయి విచారణ కొనసాగుతోందని డిఎఫ్ఓ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.