Take a fresh look at your lifestyle.

బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ 

0 41

చిత్తూర్ :  చిత్తూర్ (వెస్ట్ ),కుప్పం రేంజ్  పరిధిలో ఇటీవల జరిగిన ఏనుగుల దాడి వరస సంఘటనల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వ  తాత్కాలిక  సహాయం కింద ఒక్కొక్క  కుటుంబానికి  లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను ఎంపీ రెడ్డప్ప పంపిణి చేసారు.

పర్తిచెనుకు చెందిన ఇంటర్ విద్యార్థిని సోనియా, బండపల్లికి  చెందిన పాపమ్మలు మృతిచెందారు .చింతపల్లికి చెందిన నారాయణప్ప తీవ్రగాయాలతో కుప్పం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే .

బాధిత కుటుంబాలను ఆదుకునే క్రమంలో అటవీశాఖ ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిధిగా  హాజరయ్యారు.  బాధిత కుంటుంబాలకు ఎక్సగ్రేషియా  చెక్కులను అందచేశారు.  మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ,తీవ్రంగా గాయపడ్డ  నారాయణప్ప కుటుంబానికి రూ 50,000 చెక్కుల ను అందచేశారు.  సిఫ్ రామకృష్ణ మాట్లాడుతూ నిబంధనల మేరకు మృతుల కుటుంబాలకు రూ 5లక్షలు  ఎక్స్గ్రేషియా కింద చెల్లించాల్సి ఉందని దీనికి సంబంధించి ప్రాసెస్ చేస్తున్నామని అంతవరకు తాత్కాలికంగా లక్ష చొప్పున అందచేశామని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ రాహుల్ పాండే,డిఎఫ్ఓ రవి శంకర్ తదితర అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.