Take a fresh look at your lifestyle.

మొసలిని బోల్తా కొట్టించిన తాబేలు…

0 18

తెలివి తేటల్లోనే కాదు… దృఢత్వంలోనూ తాబేలుదే గెలుపు…

అప్పుడు తెలివితేటలు… ఇప్పుడు దృఢత్వాన్ని నిరూపించుకున్న తాబేలు.  అందుకు ఈ ఫోటోలు,వీడియోలు  సాక్షిభూతాలుగా నిలిస్తున్నాయి.  ఇది కాస్తా వైరల్ గా మారింది.

చిట్టి పొట్టి కధల్లో కుందేలు వెర్సెస్ తాబేలు పరుగుపందెంలో తన తెలివి తేటలతో నిదానంగా నడచి విజయం సాధించి నిదానమే ప్రధానమని ప్రపంచానికి చాటి చెప్పిన తాబేలు… నేడు అత్యంత  దృఢత్వం కలిగి బలవంతమైన మొసలిని బోల్తా కొట్టించిన వైనం వెలుగు చూసింది.  ఈ విషయాన్ని ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ ఆఫీసర్ నవీద్ త్రయంబు తన ట్వీట్టర్ లో పొందు పరచి తాబేలు గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

విషయానికి వస్తే దృఢత్వం కలిగిన మొసలి మడుగులో నుంచి బయటకు వాచ్చి అటుగా వెలుతున్న తాబేలును తన పదునైన దవడలతో బందించి తినబోయింది అయితే తాబేలు షెల్ అంత కంటే గట్టిదనంతో ఉండడంతో దాన్ని కొరకు లేక పట్టు వదిలింది. అంతే…  ఉపాయం కలిగిన తాబేలు తృటిలో అపాయం నుంచి తప్పించుకుని బయటపడింది. గెంతుకుంటూ అక్కడినుంచి పరారయ్యింది. ఇదే విధంగా రెండు సార్లు ప్రయత్నం చేసిన మొసలికి ఆశా భంగం తప్పలేదు. మొసలి దృఢత్వం కలిగిన దౌడల కంటే తాబేలు షెల్ అంతకంటే దృఢమైనదిగా ఈ సన్నివేశం ద్వారా ప్రపంచానికి తెలియవచ్చింది. 

అప్పుడు పరుగు పందెం లో కుందేలుతో ఇప్పుడు నిజజీవితంలో దృఢత్వంలో మొసలిని బోల్తా కొట్టించి భేష్ అనిపించుకుంది తాబేలు.   https://twitter.com/i/status/1305711839725015040 

Leave A Reply

Your email address will not be published.