Take a fresh look at your lifestyle.

విశాఖ జూలో పెంగోలియాన్ మృతిపై అనుమానాలు! ఆ పెంగోలియాన్ కు ఏమైంది ?

0 87

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు ఎంతో చాకచక్యంగా స్మగ్లర్ల నుంచి గత జులై 18న స్వాధీనం చేసుకున్న అత్యంత అరుదుగా కనిపించే పెంగోలియాన్ (ఆలుగు)  విశాఖపట్నంలో గల ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు లో ఇటీవల మృతి చెందడం విచారకరం. ఆరోగ్యవంతంగా గల అలుగు మృతిపై జంతుప్రేమికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  సరైన ఆహారం అందించకపోవడం వల్లే అలుగు మృతి చెందినట్లు స్పష్టమవుతోంది.

గుంటూరులో స్మగర్ల నుంచి పట్టుకున్న ఆరోగ్యంగా గల అలుగు  సంరక్షణ బాధ్యతలను విశాఖ జూ అధికారులకు అప్పగిస్తూ అలుగును అప్పట్లో వైజాగ్ జూకు తరలించారు. వాస్తవంగా కోర్టు అనుమతితో నేచురల్ హేబిటేట్ అటవీ ప్రాంతంలో అలుగును విడుదల చేయాల్సి ఉండగా పొరపాటున విశాఖ జూ కు తరలించారు. అరుదైన,అంతరించిపోతున్న జాతి జంతువులను నేచురల్ హేబిటేట్ లోకి విడుదల చేసే విషయంలో వైల్డ్ లైఫ్ యాక్టు 1972 ప్రకారం కోర్టు అనుమతి తప్పని సరి. అయితే అలుగు విషయంలో నిబంధనలు అలా ఉంచితే జూకు తరలించి సంరక్షించడం తో ఆలుగు మృతికి ప్రధాన కారణంగా విమర్శలు వినవస్తున్నాయి.

అదే విధంగా అడవిలో స్వతంత్రంగా జీవించే అలుగుకు ఇచ్చే ఆహరం విషయంలో జూ మేనేజిమెంట్ కేవలం చీమలను అందించడంతో అది వికటించి అలుగు మృతికి కారణంగా మరికొందరు భావిస్తున్నారు. కాగా కొద్దీ రోజుల కిందట అలుగు మృతి చెందిన విషయాన్ని అత్యంత గోప్యంగా దాచిపెట్టారు. అదీ కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా అలుగు మరణించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

గతంలో అలుగు స్వాధీనం చేసుకున్న వైనం పిసీసీఎఫ్ కధనం ప్రకారం …

యడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన ఉయ్యాల శివ కోటేశ్వరరావు, ఉయ్యాల శివయ్య మరో ఇద్దరు కలసి అలుగును యడ్లపాడు ఏరియాలో వలవేసి పట్టుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని వారు యూ ట్యూబ్ లో అమ్మకానికి పెట్టారు. యూ ట్యూబ్ లో ట్రాఫిక్  ఇండియా వారు విషయాన్ని గమనించి ఆంద్రప్రదేశ్ అటవీశాఖ అడిషనల్ పి.సి.సి.ఎఫ్. గోపినాథ కు సమాచారం అందించారు.

ఈ మేరకు గత మూడు రోజుల నుండి ట్రాఫిక్ ఇండియా ప్రతినిధులు, అటవీశాఖ సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి వారితో బేరసారాలు సాగించారు. ఎట్టకేలకు 65 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. పారేస్ట్ రేంజి ఆఫీసర్, ధర్మ రక్షిత్, డి.ఆర్.ఓ హానోక్ శ్యాంసన్ లను రాజమండ్రి నుంచి వచ్చి కొనుగోలు దారులుగా వారి వద్దకు పంపారు. వీరు కొనుగోలు దారులు నమ్మ డానికి వారు అనేక విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత అలుగును వీరు చూపించారు. . డీల్ కుదుర్చుకున్న మొత్తంలో యాబై శాతం నగదుగా మరో యాబై శాతం అన్ లైన్ లో ట్రాన్సఫర్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ  ఒప్పందం మేరకు నలుగురు స్మగ్లర్లు గుంటూరు నగరం లోని ఓ ప్రదేశంలోనికి రాగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోనికి తీసుకొన్నారు. ఈ సంఘటనలో శివయ్య, శివ కోటేశ్వరరావులు దొరకగా మరో ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారు. వారి వద్ద నుంచి అలుగును స్వాధీనము చేసుకున్న సిబ్బంది ఆ జంతువును ఆరోగ్య పరిస్థితి పై సంభందిత వైద్యులచేత పరీక్షలు జరిపించారు. అలుగు పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఆ జంతువును సేఫ్ గా ఉంచారు, పారిపోయిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ఈ విషయాన్ని పోలీసుల దృష్టి కి తీసుకు వెళ్ళడం జరిగింది. జంతువును అపహారించిన సంఘటనలో ఇద్దరు నిందితుల నుంచి పూర్తి విషయాలను అధికారులు సేకరిస్తున్నారు. అసలు ఆ జంతువును ఎక్కడ అపహారించారు, ఎలా  దానిని విక్రయానికి పెట్టారు, గతం లో వీరు ఇంకా ఏమైనా జంతువులను విక్రయించారా అనే విషయం పై అధికారులు పూర్తి  స్థాయి విచారణ చేస్తున్నారు.

అలుగు మృతిపై వివరణ కోరగా…

జూ సంరక్షణలో గల పెంగోలియాన్ మృతి పై జూ క్యూరేటర్ నందిని సరై ను వివరణ కోరగా అలుగు మృతి చెంది విషయం వాస్తమేనని ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా అందుకు సంబందించిన పూర్తి వివరాలు మేసేజ్ చేస్తామన్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టె వరకు ఆమె నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

 

 

Leave A Reply

Your email address will not be published.