Take a fresh look at your lifestyle.

రెండవ సారి అధ్యక్షునిగా ‘రమేష్’ ఎన్నిక

0 347

Hyderabad: The South End Park Residents Welfare Association under Mansoorabad division has elected M. Ramesh as its president for the second time.

హైదరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో గల సౌత్ ఎండ్ పార్కు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షునిగా ఎమ్. రమేష్ రెండవ సారి గెలుపొంది సత్తాచాటారు. 2020-22 రెండేళ్ల కాలపరిమితికి గాను ఈ రోజు జరిగిన అసోషియేషన్ ఎన్నికల్లో తన సమీప  ప్రత్యర్థి మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పై అనూహ్యంగా విజయం సాధించారు. అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా రమేష్ ,శ్రీనివాస్ రెడ్డిల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే కాలనీ సిట్టింగ్ అధ్యక్షునిగా రమేష్ గతంలో చేసిన మంచిపనులే ఆయన  రెండవ సారి అధ్యక్షునిగా ఎన్నికకు కారణమైంది.

రోడ్లు విస్తరణ, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కరోనా నివారణలో భాగంగా ముమ్మర పారిశుద్ధ్య పనులు చేపట్టి తనదైన ముద్రవేసుకున్నారు. లాకౌట్ సమయంలో అనుమానితులు కాలనీలోకి రాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టి కట్టుదిట్టం చేయడంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు.  అదే విధంగా భారీ వర్షాలు, వరదల సమయంలో కాలనీ వాసులకు ఆపన్న హస్తం అందించారు. ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించిన రూ.10,000 ఆర్ధిక సహాయాన్ని ఇంటింటికి తిరిగి పంపణీని పర్యవేక్షించి ప్రత్యేకతను చాటుకున్నారు. అందుకే  రెండవ సారి అధ్యక్షునిగా ఆయన గెలుపు అనివార్యమైంది. అధ్యక్షునిగా రెండవ సారి ఎన్నికైన రమేష్ ను పలువురు అభినందించారు.

కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి…

సౌత్ ఎండ్ పార్కు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఎన్నికల్లో రెండవ సారి అధ్యక్షునిగా తన గెలుపుకు సహకరించి, ఆదరించి,అభిమానించిన వారందరికీ  ఈసందర్భంగా రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసుల సహకారంతో కాలనీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

నూతన కార్యవర్గం …

అధ్యక్షునిగా ఎమ్. రమేష్, ఉపాధ్యక్షులుగా టి. రవి కుమార్, ప్రధాన కార్యదర్శిగా  పి విద్యాసాగర్ రావు, సంయుక్త కార్యదర్శిగా పి.పి.రెడ్డి, కోశాధికారిగా పి.రాజేశ్వర్ రెడ్డి, సహాయ కోశాధికారిగా డేవిడ్ సుధాకర్ లు ఎన్నికయ్యారు.

మరో 11మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు మహిళా సభ్యులు ఉన్నారు. ఎన్నికల అధికారిగా ఎమ్.ఎస్.మణి వ్యవహరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగెందుకు ఆంజనేయులు, తదితరులు పూర్తి తోడ్పాటు అందించారు.

Leave A Reply

Your email address will not be published.