Take a fresh look at your lifestyle.

FCRI @ 4 Years… Great Achievement…

Forest College and Research Institute (FCRI) Mulugu, which blossomed in 2016. The research institute was at the reach of the students’ careers by the time they complete the first batch of four years, Progressed with all facilities never the less.

The Management paved the way for the development of the college with the support of the government and on the other hand the FCRI reputation was universalized for gaining admissions in top colleges like Auburn etc., with excellent results. Today marks the fourth anniversary of the FCRI and the convocation of the first batch of college.

2016లో మొగ్గ తొడిగిన ఫారెస్ట్ కళాశాల.పరిశోధనా సంస్థ నాలుగేళ్ల మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న సమయంలోనే అన్ని హంగులు కల్పించుకొని విద్యార్థుల కెరియర్  కు చుక్కానిలానిలిచింది. అన్ని వసతులతో పురోభివృద్ధి సాధించింది. ఒక వైపు కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ తోట్పాటుతో యాజమాన్యం బాటలు వేయగా రెండో వైపు ఉత్తమ ఫలితాలతో అబార్న్ వంటి మేటి విద్యాలయాల్లో ప్రవేశాలు పొంది ఎఫ్సి ఆర్ ఐ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఎఫ్ సి ఆర్ ఐ స్థాపించి నాలుగేళ్లు పూర్తీ చేసుకుని కళాశాల మొదటి బ్యాచ్ రిలీవ్ అవుతున్న సందర్భంగా కాన్వకేషన్ కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుకోనుంది.

సీఎం ఓ ఎస్ డి ప్రియాంక వర్గిష్, తిమిరీస్ సెక్రటరీ బి షఫీయుల్లాహ్ దంపతుల వినతి, అందుకు సీఎం సాకారం 2016లో ములుగు ఫారెస్ట్ కళాశాల.పరిశోధనా సంస్థ ఏర్పాటుకు నాంది పలికింది. దీనికి
తోడు ఫారెస్ట్ మానేజ్మెంట్ లో విశేష  అనుభవం కలిగిన అదనపు పీసీసీఎఫ్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి డీన్ గా సిఎం ఆదేశాల మేరకు తన ఆలోచనలను రంగరించి కళాశాల పురోభివృద్ధే ద్యేయంగా విస్తృత సేవలు అందించారు. ఆయన కృషికి కళాశాల అధికారులు, సిబ్బంది సహకారం నిర్ణీత కాలంలోనే ఎఫ్ సి ఆర్ ఐ అన్ని హంగులతో మేటి కళాశాలగా జాతీయ స్థాయిలో వెలుగొందుతోంది

ప్రపంచ స్థాయి విద్యాప్రమాణాలతో విద్యార్థుల కెరియర్ ను తీర్చిదిద్దడమే కాకుండా కళాశాలకు అవసరమైన వసతుల కల్పనలో ముందడుగు వేశారు.ప్రశాంత వాతావరణంలో తరగతులు, పరిశోధనలు జరిపేందుకు వీలుగా మలుగు సమీపంలో అన్ని హంగులతో కళాశాలకు సొంత భవన్ సముదాయాల్ని నిర్మించి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అదే విధంగానాక్  ఏ ప్లస్ అక్క్రిడేషన్ తో పాటు ఉన్నత విద్యాప్రమాణాలకై  ప్రఖ్యాత అబార్న్ యూనివర్సిటీ తో ఒప్పందం ప్రత్యేకతగా నిలిచాయి

Leave A Reply

Your email address will not be published.