Telangana: Minister IK Reddy inaugurates Monkey Rehabilitation Center and the Rat Deer Park at Nirmal
Minister Indrakaran Reddy inaugurated the monkey conservation and rehabilitation center, rat deer park, chain link, safari, gazebo, eco huts and boating for small children in Gandi Ramanna Green Forest, in Nirmal District today.
గండి రామన్న హరిత వనంలో (నిర్మల్ జిల్లా) కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం, మూషిక జింకల పార్కు, చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్ అభివృద్ది పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
హరిత వనంలో సఫారీ వాహనాన్ని నడిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ: రూ. 2.25 కోట్ల వ్యయంతో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం: దేశంలో రెండవది- రాష్ట్రంలో తొలి పునరావాస శిబిరం: అర ఎకరం విస్తీర్ణంలో రూ. 8 లక్షల వ్యయంతో మూషిక జింకల పార్కు ఏర్పాటు: రూ.2.65 కోట్ల వ్యయంతో హరిత వనం పార్కులో అభివృద్ది పనులు
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ
దేశంలో రెండవ, దక్షిణ భారత దేశంలోనే తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె’ అని సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు.
దశల వారీగా గ్రామ పంచాయతీల సహకారంతో కోతులను పట్టుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారని, అవి పూర్తిగా కోలుకున్నాకా మళ్ళీ అడవుల్లో వదిలేస్తారని వెల్లడించారు. పర్యావరణ సమతుల్యత ద్వారానే మానవజాతి మనుగడ సాధ్యమనే నమ్మి అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
వన్యప్రాణులకు ఆహారంగా అవసరమయ్యే తీసుకోవడంతో అద్భుతమైన ఫలితాల కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో తీసుకుంటున్నామని, పూలచెట్లు, పండ్ల చెట్లు, నీడ చెట్లు, జౌషధ మొక్కలను విరివిగా నాటుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, జెడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి రెడ్డి, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, తదితరులు పాల్గొన్నారు.