Take a fresh look at your lifestyle.

AP: CM green signal for setting up of multipurpose facility centers including food processing at Rs 10,235 Cr

CM YS Jagan Mohan Reddy Review of Dr. YSR RBKs, Agricultural Marketing, Food Processing, and Amul Project at his Camp Office today. CM YS Jagan gave the green signal for setting up of Multi Purpose Facility Centers including Agricultural Marketing and Food Processing under RBKs across the state. For multipurpose facility centers including food processing, a total of Rs. 10,235 crore, he said, adding that the CM had directed the authorities to prepare plans to complete these within a year starting March 2021.

రూ. 10,235 కోట్లతో ఫుడ్ ప్రాససింగ్ సహా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్

డాక్టర్ వైయస్సార్ ఆర్బీకేలు, వ్యవసాయ మార్కెటింగ్, ఫుడ్ ప్రాససింగ్, అమూల్ ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల పరిధిలో వ్యవసాయ మార్కెటింగ్, పుడ్ ప్రాససింగ్ సహా మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుకు సీఎం వైయస్.జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఫుడ్ ప్రాససింగ్ సహా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లకోసం మొత్తంగా రూ. 10,235 కోట్లు అవుతుందని ప్రతిపాదించగా, వీటిని 2021 మార్చిలో ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో గొడౌన్లు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, కలెక్షన్ సెంటర్లు, కోల్డు రూంలు, కోల్డ్ స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, అసైయింగ్ ఎక్విప్మెంట్ పుడ్ ప్రాససింగ్ ఇన్ఫ్రా, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, ఆక్వా ఇన్ఫ్రా, పశుసంవర్ధక ఇన్ఫ్రా, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, జనతాబజార్లు, ఇ– మార్కెటింగ్ తదితర సదుపాయాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన ఇన్పుట్స్ను ఇవ్వడమే కాదు, సకాలానికే వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడమన్నది చాలా ముఖ్యమన్నారు.

రైతు ఆర్డర్ చేయగానే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని ఎప్పటిలోగా అందిస్తామనే విషయాలను ముందుగా రైతులకు తెలియజేయడంతో పాటు ఎప్పటిలోగా వాటిని ఇస్తామన్న విషయాన్ని చెప్తూ ఆర్బీకేల్లో డిస్ప్లే చేయాలని సీఎం కోరారు. ఆర్డర్చేసినా నాకు టైంకు అందలేదనే మాట ఎక్కడా రాకూడదని, ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుని, అధికారులను నియమించుకోవాలన్నారు.
నాణ్యమైన ఆక్వాఫీడ్, ఆక్వా సీడ్ ఆర్బీకేల ద్వారా రైతులకు అందించాలని సీఎం కోరారు.

వీటి నాణ్యతను నిర్ధారించేందుకు నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు చేసే ల్యాబులను ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు. సేంద్రియ, సహజ పద్ధతులకు పెద్దపీట వేసేలా సంబంధిత ఉత్పత్తులను ఆర్బీకేల పరిధిలోకి తీసుకురావాలి. వీటికి పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించాలి ఏలూరు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి ఆర్గానిక్ వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రచారం, ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బయోపెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసే యూనిట్లను గ్రామాలస్థాయిలో ప్రోత్సహించాలి. ఆర్బీకేల భాగస్వామ్యంతో కనీసం ప్రతి గ్రామానికీ 3 యూనిట్లు ఉండేలా చూడాలని, దీనివల్ల కల్తీ లేకుండా, నాణ్యమైన సేంద్రీయ ఎరువులు అందుబాటులోకి వస్తాయని సూచించారు.

విత్తనం నుంచి విక్రయం వరకూ..
విత్తనం నుంచి విక్రయం వరకూ.. అనే నినాదం ఆర్బీకేల విధులు కావాలని, విత్తనం నుంచి విక్రయం వరకూ మధ్యనున్న కార్యకలాపాల్లో రైతులకు చేదోడు, వాదోడుగా ఆర్బీకేలు నిలబడతాయన్నారు. ఆర్బీకేల కార్యకలాపాలు, వాటిని మరింత సమర్థవంతంగా నడిచేలా వ్యవసాయ వర్శిటీ తన కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆర్బీకే కార్యకలాపాలను కేటగిరీలుగా విభజించి మార్కెటింగ్, పంటలకు ముందు, పంటల తర్వాత తదితర అంశాలపైన అగ్రి వర్శిటీ పాఠ్యప్రణాళిక కావాలన్నారు. తర్వాత వారు అప్రెంటిస్లో భాగంగా వీటిపై పట్టు సాధించాలి: దీనివల్ల వారికి ఈ అంశాల్లో సమర్థత పెరుగుతుంది: రైతు బజార్ల నిర్మాణంకూడా నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తిచేసేలా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

మార్కెట్ యార్డుల్లో నాడు –నేడు
ఇప్పుడున్న మార్కెట్ యార్డుల్లో నాడు –నేడుకు శ్రీకారం చుట్టాలని, దాదాపు రూ.212 కోట్లతో నాడు – నేడు కింద పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ఆధునీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్బీకేల పై సీఎంకు వివరించిన అధికారులు రాష్ట్రంలో 10,641 ఆర్బీకేలతోపాటు కొత్తగా 125 అదనపు అర్బన్ ఆర్బీకేలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, వీటితో రాష్ట్రంలో 10,766 ఆర్బీకేలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఆర్బీకే హబ్లలో వాహనాల సంఖ్య 65 నుంచి 154కు పెంపు ప్రతి ఆర్బీకేల్లోనూ కంప్యూటర్, ప్రింటర్లు, యూపీఎస్, బయోమెట్రిక్ డివైజ్లు మార్చి 31 నుంచి 147 నియోజకవర్గాల స్థాయి ల్యాబులు పని ప్రారంభిస్తాయని వెల్లడించిన అధికారులు 13 జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబులు జూన్ 30 కల్లా ఏర్పాటవుతాయని అధికారులు సీఎం కు వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జెడ్బిఎన్ఎఫ్ అడ్వైజర్ అండ్ వైస్ ఛైర్మన్ టి విజయకుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్కుమార్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, ఏపీ డెయిరీ డవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఏ, ఏపీ ఆగ్రోస్ ఎండీ ఎల్ శ్రీకేష్ బాలాజీరావు, సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ ఏ.సూర్యకుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

 

Leave A Reply

Your email address will not be published.

If you're looking for a fun and exciting new casino destination, look no further than Pin Up Casino India! Our online casino https://pinupcasino-india.in offers players a wide range of games to choose from, as well as some great bonus offers. We know that Indian players are looking for the best online gaming experience, and we are committed to providing just that! So come join us at Pin Up Casino India today and see what all the fuss is about!