Take a fresh look at your lifestyle.

Singareni retired officers gets Contribution Pension Scheme with initiative of CMD

Retired officers who have served for decades at the Singareni Calories Company have received a sweet treat. EDCs payable to retired workers from 2007 onwards. The Pension Scheme (Executive Defined Contribution Pension Scheme) soon paved the way for the receipt of money. The next LIC to manage this pension type money. The trust, set up by Singareni to pay through, approved the tax exemption at a meeting of the Inland Revenue Department held on the 19th of this month.

పెన్షన్‌ ట్రస్టు సొమ్ములకు ట్యాక్స్‌ మినహాయింపుకు ఇన్‌ కంటాక్స్‌ వారి ఆమోదం

సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్ లకు

అభినందనలు తెలిపిన రిటైర్డు అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

సింగరేణి కాలరీస్‌ కంపెనీలో దశాబ్దాల పాటు సేవలందించి రిటైర్డ్‌ అయిన అధికారులకు ఒక తీపి కబురు అందింది. 2007వ సంవత్సరం నుండి రిటైర్డు కార్మికులకు చెల్లించాల్సి ఉన్న ఇ.డి.సి. పైన్షన్‌ స్కీం (ఎగ్గిక్యూటివ్‌ డిఫైన్డ్‌ కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీం) సొమ్మును త్వరలోనే అందుకొనేందుకు మార్గం సుగమం అయింది. ఈ పెన్షను తరహా సొమ్మును నిర్వహించడానికి తదుపరి ఎల్‌.ఐ.సి. ద్వారా చెల్లించడానికి సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ట్రస్టు వారికి ఈ నెల 19వ తేదీన నిర్వహించిన ఇన్‌ కంటాక్స్‌ డిపార్డుమెంట్‌ సమావేశంలో ఇన్‌ కంట్యాక్స్‌ మినహాయింపుకు ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ వారు ఈ ట్రస్టులో రిటైర్డు అధికారులకు చెల్లించాల్సి ఉన్న ఇ.డి.సి.పి.ఎస్‌. సొమ్మును జమ చేసి, తదుపరి ఈ నిధులను లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ద్వారా రిటైర్డు అధికారులకు నెలవారీ పెన్షన్‌ గా చెల్లింపు జరపడానికి మార్గం ఏర్పడిరది.

ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డు అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైన సింగరేణి రిటైర్డు డైరెక్టర్లు శ్రీ పరిటాల వాసుదేవరావు, శ్రీ జె.వి.దత్తాత్రేయులు తమ హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన సంస్థ సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ గత బోర్డు సమావేశంలో తమ సమస్యలను తీర్మానంగా పెట్టి ట్రస్టు ఏర్పాటుకు ఆమోదించడమే కాక ఉమ్మడి ఇన్‌ కంట్యాక్స్‌ విభాగం వారితో ట్యాక్స్‌ మినహాయింపుకు కృషి చేయడంపై రిటైర్డు అధికారులందరి తరపున తమ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తమ సమస్యల పరిష్కారంలో మొదటి నుండి చొరవ చూపిన డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) శ్రీ ఎన్‌.బలరామ్‌, డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) శ్రీ ఎస్.చంద్రశేఖర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్యాక్స్‌ మినహాయింపు లభించిన నేపథ్యంలో తగిన నిధులను సమకూర్చి చెల్లింపు ఏజెన్సీగా ఉన్న ఎల్‌.ఐ.సి. ద్వారా రిటైర్డు కార్మికులకు పెన్షన్‌ చెల్లింపు జరిగేలా చూడాలని వారు కోరారు.

ఏమిటీ కంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీం ?

సింగరేణిలో కార్మికులకు వేతన సవరణకు ప్రతీ 5 సంవత్సరాలకు వేజ్‌ బోర్డు ఉన్నట్లే, సింగరేణి అధికారులకు కూడా కోల్‌ ఇండియా స్థాయి వేజ్‌ బోర్డు ఉంది. అయితే ఇది 10 సంవత్సరాల కాల పరిమితితో అమలవుతూ ఉంటుంది. 2007వ సంవత్సరంలో అధికారుల కోసం ఏర్పాటైన వేజ్‌ బోర్డులో అధికారులకు ఫెర్పార్మెన్సు రిలేటెడ్‌ పే (పి.ఆర్‌.పి.) ని చెల్లించాలని నిర్ణయించారు. దీనితో పాటు 2007 నుండి అధికారులకు కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీం కూడా అమలు జరపడానికి నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతీ అధికారికి చెల్లించాల్సిన పెర్కుల్లో భాగంగా బేసిక్ డి.ఎ. మొత్తంపై 9.84 శాతం సొమ్మును తీసి ఒక నిధిగా ఏర్పాటు చేయాలని, రిటైరైన తర్వాత అధికారులకు ఈ సొమ్మును పెన్షన్‌ తరహాలో చెల్లించాలని నిర్ణయించారు.

అయితే ఇది కోలిండియాలో కూడా అమలుకు నోచుకోలేదు. రిటైర్డు అధికారుల సంఘాలు చేసిన నిర్విరామ సంప్రదింపులు. పైరవీల ఫలితంగా కోలిండియా బోర్డులో దీనికి ఆమోదం లభించింది. 2019 ఏప్రియల్‌ 1వ తేదీన రిటైర్డు అధికారులకు చెల్లింపు పర్వం ప్రారంభించారు. కోలిండియాలో అమలు జరిపారు కనుక సింగరేణి కూడా దీన్ని అమలు జరపాలని సింగరేణి రిటైర్డు అధికారుల సంఘం సింగరేణి యాజమాన్యానికి మొరపెటుకొన్నారు.

గతంలో ఎవరూ పట్టించుకోనప్పటికీ ప్రస్తుత సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ సానుకూలంగా స్పందించారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో కోల్‌ ఇండియా మాదిరిగా సింగరేణి రిటైర్డు అధికారులకు ఇ.డి.సి. పెన్షన్‌ స్కీం అమలు జరపడానికి, ఇందుకోసం ఛైర్మన్‌ సారథ్యంలో ఒక ట్రస్టు ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు. అంతేకాదు ఈ ట్రస్టు రిటైర్డు అధికారుల కోసం ఏర్పాటు చేసింది కనుక ఈ పెన్షన్‌ చెల్లింపుకు ఆదాయం పన్ను నుండి మినహాయించాలని కూడా రాష్ట్ర ఇన్‌ కంట్యాక్స్‌ వారిని కోరారు. దీనికి గత 19వ తేదీన ఇన్‌ కంట్యాక్స్‌ శాఖ ఆమోదం తెలిపింది.

దీనితో ఇప్పుడు యాజమాన్యం రిటైరైన అధికారులకు వారు పని చేసిన కాలం, వారి బేసిక్‌ డి.ఎ. ప్రకారం 9.84 శాతం మినహాయించి కంపెనీ వద్ద ఉంచుకున్న సుమారు 300 కోట్ల రూపాయాలను ట్రస్టులో జమ చేయనుంది. ట్రస్టులో ఉన్న సొమ్మును రిటైర్డు అధికారులకు చెల్లించడానికి సింగరేణి సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ను నియమించుకుంది. ఈ సంస్థ వారు రిటైరైన అధికారులు ఎంచుకున్న బ్యాంకు లేదా ఇన్సూరెన్సు కంపెనీ ద్వారా వారి సొమ్మును చెల్లించనుంది.

ప్రతి అధికారి పేరిట ఉన్న మొత్తం సొమ్ములో ముందుగా మూడిరట ఒక వంతు సొమ్మును మాత్రమే రిటైర్డు అధికారి తీసుకునే వీలుంది. లేదా పెన్షన్‌ రూపంలో కూడా పొందవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క అధికారికి సగటున నెలకి 3 నుండి 4 వేల రూపాయల వరకూ పెన్షన్‌ వచ్చే అవకాశం ఉందనీ, ఇది వారికి ఆర్ధికంగా చాలా ఊరట కల్గిస్తుందని రిటైర్డు అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు  వాసు దేవరావు,  జె.వి.దత్తాత్రేయు లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.