Take a fresh look at your lifestyle.

KCR gift Kalpakavanam Park to people of Gajwel

CM KCR own constituency Gajwel has been allotted Rs 117 hectares at Singapore at a cost of Rs. 7.43 crore Kalpakavanam, developed by the Forest Department, was gifted by the CM of Urban Forest Park. Ministers of State Indrakaran Reddy and Harish Rao inaugurated the park today and made it accessible to the residents of Gajwel.

సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్ ప్రజలకు పర్యావరణం ఉట్టిపడే విధంగా సంగాపూర్ వద్ద  117 హెక్టార్లలో రూ. 7.43 కోట్ల వ్యయంతో అటవీశాఖ అభివృద్ధి పరచిన కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ సీఎం కానుకగా లభించింది. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావులు పార్కును ఈ రోజు ప్రారంభించి మొక్కలు నాటి గజ్వేల్ వాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు.

సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా గజ్వేల్ మండలం సంగాపుర్ లో 117 హెక్టార్లలో రూ. 7.43 కోట్ల వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేశారు. గజ్వేల్ – వర్గల్ ప్రధాన రహదారిని అనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్  ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు. పార్కు లోపల ‘సేవ్ ఫారెస్ట్..సేవ్ ఎర్త్’ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్,  వాచ్ టవర్, ఒపెన్ జిమ్, చిన్న పిల్లల కోసం ప్రత్యేక  ఆట స్థలం, గజీబొ, రాశివనం, ఒపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలతో పార్కును సుందరంగా తీర్చిదిద్దారు

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ  అతి తక్కువ సమయంలో రాష్ట్రంలో 4 శాతం అడవుల పునరుద్ధరణ జరిగిందనిపేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల క్షీణించిన  అడవుల పునరుద్ధరణ జరిగిందని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెళ్లువ వస్తున్నాయన్నారు. గజ్వేల్ సమీపంలో 292.5 ఎకరాల భూమిలో 7.5  కోట్ల రూపాయలతో అర్బన్ పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయని ఆలోచన చేసి దేశానికే ఆదర్శంగా 36 వ అర్బన్ పార్క్ ని ప్రారంభించుకోవడం పర్యావరణానికి శుభసూచకమన్నారు.  ఈ పరిసర ప్రాంతాల ప్రజలు వనభోజనాలను, పిల్లలతో విహార యాత్రలకు రండి ఇది మీ కోసమేనాని పిలుపు నిచ్చారు.

మొక్కలు నాటడం మన భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడమేనని, ఎంత ఆస్తిని ఇచ్చామనేది కాదు చక్కటి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్ళం కావాలన్నారు.

ఢిల్లీ ప్రజలు ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటుకి వెళుతున్నారని, భారత దేశంలో మొక్కల పెంపకానికి చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. రేపటి భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కేసీఆర్ మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్  రోజా రాధ శర్మ,  మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా,  గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సీఎఫ్ శర్వనంద్, డీఎఫ్ వో  శ్రీధర్ రావు, ఇతర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.