Take a fresh look at your lifestyle.

AP: Farmers need awareness on agricultural schemes: CM Jagan

Amravati: CM Jagan Mohan Reddy has directed the authorities to ensure that the government does not violate various laws brought in the agriculture and aquaculture sector at the state level for the benefit of farmers. He reviewed the activities of the agriculture and marketing departments at the CM’s camp office today.

ఏపీ: ప్రభుత్వ వ్యవసాయ పధకాల పట్ల రైతుల్లో అవగాహన అవసరం: సీఎం జగన్

అమరావతి: ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను ఉద్దేశించి రాష్ట్ర స్ధాయిలో వ్యవసాయ, ఆక్వా రంగంలో తీసుకొచ్చిన వివిధ చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులు మోసాలకు గురికాకుండా, వారికి అండగా నిలవడానికి కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు.

ఈ మేరకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లపై ఆలోచన చేయమని అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి పోలీసు విభాగంతో వ్యవసాయశాఖ సమన్వయం చేసుకోవాలన్నారు.

పొలంబడిలో భాగంగా కౌలురైతులకోసం చేసిన చట్టాలు,సాగు ఒప్పంద పత్రం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయాల పట్ల వారిలో అవగాహన కల్పించాలని, అందుకోసం ఆర్బీకేల్లో దీనికి సంబంధించిన వివరాలతో పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్బీకే కింద రైతులకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నదానిపై, అలాగే విలేజ్‌ క్లీనిక్స్‌ వద్దకూడా కార్యకలాపాలపై గ్రామ సచివాలయాలు చేస్తున్న కార్యక్రమాలపైనకూడా హోర్డింగ్‌ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు ఆయా కార్యకలాపాలపై అవగాహన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

పంటల బీమాకోసం ప్రభుత్వం తరఫున బీమా కంపెనీ ఏర్పాటుపై సత్వర చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. 2020–21 ఖరీఫ్‌నకు సంబంధించిన బీమా సొమ్ము చెల్లింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. మేలో మొదటివిడత రైతు భరోసా ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు జరగాలని సీఎం కోరారు. ఇది సక్రమంగా అమలు జరుగుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ, పరిశీలన చేయాలన్నారు.  మిల్లర్లే నేరుగా ఆర్బీకేల వద్దకు వచ్చి కొనుగోలుచేయాలన్న సందేశం గట్టిగా వెళ్లాలన్నారు.

ఏపీ అమూల్‌ ప్రాజెక్టు, ఆక్వా హబ్‌ల ఏర్పాటు, మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం సమీక్షించారు. నిధుల సమీకరణ అంశాలను ఆయన  సమీక్షించారు.

జనతా బజార్ల ఏర్పాటుతో బహుళ ప్రయోజనం: సీఎం

500 చదరపు అడుగుల నుంచి 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతాబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రోపొందించాలని, తొలిదశలో 5వేల జనాభాకు జనతా బజార్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం భవనాల నిర్మాణం  బయట మార్కెట్లో కన్నా తక్కవ ధరలకే నాణ్యమైన సరుకులు జనతాబజార్లలో లభించేలా చూడాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి కోరారు. ‌ అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని, రైతులకు కనీస మద్దతు ధరలు లభించాలని, వీటితోపాటు అవే సరుకులు వినియోగదారులకు తక్కువ ధరలకు లభించేలాఉండాలన్నారు. జనతాబజార్ల ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది సీఎం స్పష్టం చేశారు.

ఈ సమావేశం లో అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ స్పెషల్‌ సెక్రటరీ వై మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిషనర్‌ పి యస్‌ ప్రద్యుమ్న, ఏపీ డీడీసి ఎండీ అహ్మద్‌ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.