Take a fresh look at your lifestyle.

Singareni set a target of production 100 million tonnes of coal next five years: CMD N. Sridhar

Mr. N Sridhar CMD Singareni directed the authorities to complete the preparations in a timely manner to start another 14 new coal mines with a target of producing 100 million tonnes of coal in the next 5 years under the auspices of Singareni. To this end, he directed the authorities to set up another 14 new coal mines in the next four years and move the company towards achieving the coal production target of 100 million tonnes.

వచ్చే నాలుగేళ్లలో 14 కొత్త గనులకు ప్రణాళికలు: సిఎండి ఎన్‌.శ్రీధర్‌
నాలుగు ప్రస్తుత గనుల విస్తరణకు చర్యలు
ఉత్పత్తి వ్యయం తగ్గింపు, ఉత్పాదకత పెంపుదలలే తక్షణ లక్ష్యాలు
కార్మికులతో కూడా మేథోమథన సదస్సు
2 రోజుల ఉన్నతస్థాయి మేథోమథన సదస్సులో సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వచ్చే 5 ఏళ్లలో 100 మిలియను టన్నుల బొగ్గు ఉత్పత్తి  లక్ష్యంగా మరో 14 కొత్త బొగ్గు గనులను ప్రారంభించేందు సకాలంలో సన్నాహాలు పూర్తిచేయాలని సిఎండి ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వచ్చే నాలుగు సంవత్సరాలలో మరో 14 కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేసి 100 మిలియను టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కంపెనీని ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.

హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో గురు, శుక్ర వారల్లో (ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో) రెండు రోజుల పాటు జరిగిన మేథోమథన సదస్సులో సింగరేణి డైరెక్టర్లు, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం సింగరేణి 65 మిలియను టన్నుల బొగ్గు ఉత్పత్తి నుండి వచ్చే ఏడాది 67 మిలియను టన్నులకు ఎదుగుతోందని, రానున్న 5 ఏళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి  ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సింగరేణి డైరెక్టర్లతో పాటు, సింగరేణి మైనింగ్‌, ప్లానింగ్‌, ఎస్టేట్స్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, పర్సనల్‌, పర్చేజ్‌, ఐ.టి., వంటి కీలక విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సింగరేణి కంపెనీ భవిష్యత్తు, ప్రగతి వ్యూహాలపై సుదీర్ఘ మేథోమథనం జరిపారు. దేశ, రాష్ట్ర బొగ్గు, విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొంటూ, సింగరేణి సంస్థ కూడా అభివృద్ధి పథంలో అగ్రగామిగా ఉండేలా భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలని సూచించారు.

నాలుగేళ్ల కాలంలో కొత్తగా 14 గనులు తెరవాల్సి ఉందనీ, అలాగే ప్రస్తుతం నడుస్తున్న 4 గనులకు విస్తరణలు సాధించాల్సి ఉందనీ, వివిధ రకాల అనుమతులు సాధించడానికి ఇప్పటినుండే సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన బొగ్గు మార్కెట్టులో వచ్చిన మార్పులను వివరిస్తూ సింగరేణి సంస్థ పోటీ మార్కెట్టును తట్టుకొని నిలబడాలంటే నాణ్యతను పెంచడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని కూడా భారీగా తగ్గించుకోవాలనీ వివరించారు.

బొగ్గు ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గాలంటే యంత్రాల పనిగంటలు ఇంకా పెరగాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల షవల్స్‌ రోజుకి 10 నుండి 14 గంటలు ఉత్పత్తిలో పాల్గొంటున్నాయనీ, వీటి ఉత్పత్తి కాలాన్ని 18 గంటల వరకూ పెంచాలన్నారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయం ఈ ఏడాది టన్నుకు సుమారు 9 వేల వరకూ చేరిందనీ, దీనిని ఎంతగా తగ్గిస్తే కంపెనీకి అంత ప్రయోజనమని వివరించారు. భారీ యంత్రాల ప్రస్తుత పనిగంటలు ఇంకా పెంచడం కోసం ఆపరేటర్లతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి, మేథోమథనం జరపాలనీ, ఉత్పాదకత పెరిగేలా చూడాలని కోరారు.

భూగర్భ గనులలో ఎస్‌.డి.ఎల్‌. యంత్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయించాలనీ, భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించుకోవడానికి నిర్దిష్టమైన కార్యచరణను అమలు జరపాలన్నారు.

దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేత దిశగా పోతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణికి పటిష్టమైన భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో సోలార్‌, థర్మల్‌ విద్యుత్తు రంగాలోకి అడుగుపెట్టామనీ, నిర్మాణంలో ఉన్న 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలనీ, మరో 300 మెగావాట్ల ప్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటును మానేరు డ్యాం మీద నిర్మించడానికి ప్రయత్నిస్తునామనీ వివరించారు. బొగ్గు, విద్యుత్‌ ఉత్పాదన ద్వారా కంపెనీకి మంచి ఆర్ధిక పూనాదిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌ & పా)  శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌ & పి&పి) శ్రీ ఎన్‌.బలరామ్‌, డైరెక్టర్‌ (ఇ&ఎం) శ్రీ డి.సత్యనారాయణరావు, ఇ.డి. (కోల్‌ మూమెంట్‌) శ్రీ జె.ఆల్విన్‌, అడ్వయిజర్‌ (మైనింగ్‌) శ్రీ డి.ఎన్‌. ప్రసాద్‌, అడ్వయిజర్‌ (ఫారెస్ట్రీ) శ్రీ కె.సురేంద్రపాండే, జి.ఎం. (సి.డి.ఎన్‌.) శ్రీ కె.రవిశంకర్‌, జి.ఎం. (మార్కెటింగ్‌) శ్రీ కె.సూర్యనారాయణ, జి.ఎం. (సి.పి.పి.) శ్రీ నాగభూషన్‌ రెడ్డి, జి.ఎం. (పి&పి) శ్రీ సత్తయ్య, జి.ఎం. (ఎస్టేట్స్‌) శ్రీ ఎస్‌.డి.ఎం.సుభానీ, ఇంకా వివిధ విభాగాల జనరల్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.