Take a fresh look at your lifestyle.

A massive program of planting 2 lakh saplings under the auspices of Singareni

As part of the Hrithaharam program for Telangana, the Singareni management has decided to plant more than 2 lakh seedlings across Singareni in a single day on the 17th of this month (February). To this extent preparations are being made for this in all areas.

17వ తేదీన 2 లక్షల మొక్కలు నాటే భారీ సామూహిక కార్యక్రమం

తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈ నెల (ఫిబ్రవరి) 17వ తేదీ ఒక్కరోజునే 2 లక్షలకు పైగా మొక్కలను సింగరేణి వ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాలలో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు.

17 వ తేదిన చేపట్టే ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్ & పా) కొత్తగూడెం కార్పోరేట్ ఏరియాలో, ఎన్.బలరామ్ (ఫైనాన్స్& పి&పి) భూపాలపల్లి ఏరియాలో, డి.సత్యనారాయణరావు (ఇ&ఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు ఏరియా జి.ఎం.లు, కార్మికులు, అధికారులు, యువకులు ఉద్యోగులు పాల్గొనున్నారు.

కరోనా జాగ్రత్తలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం తెలియజేసింది. ఈ భారీ సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో వివిధ ఏరియాల్లో నాటుతున్న మొక్కల వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెంలో రీజియన్‌ లోని కార్పోరేట్‌ ఏరియాలో 5 వేల మొక్కలు, మణుగూరులో 10 వేల మొక్కలు, కొత్తగూడెంలో 1 వెయ్యి మొక్కలు, ఇల్లందులో 1 వెయ్యి మొక్కలు, రామగుండం రీజియన్‌లోని రామగుండం-1లో 6,100 మొక్కలు, రామగుండం-2లో 6 వేల మొక్కలు, రామగుండం-3 & అడ్రియాలలో 10 వేల మొక్కలు, భూపాలపల్లిలో 10 వేల మొక్కలు, బెల్లంపల్లి రీజియన్‌ లోని బెల్లంపల్లి ఏరియాలో 41,200 మొక్కలు, మందమర్రిలో 1 లక్షా మొక్కలు, శ్రీరాంపూర్‌ లో 22 వేల మొక్కలు, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 5 వేల మొక్కలు మొత్తం అన్ని ఏరియాలలో కలిపి 2 లక్షలకు పైగా మొక్కలు నాటబోతున్నారు.

సింగరేణి సంస్థ 2015 నుండి తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటింది. ఇప్పటి వరకూ సింగరేణి సంస్థ హరితహారం కింద 4 కోట్ల 59 లక్షల మొక్కలు నాటింది. మొక్కలు నాటడమే కాక వాటి ఎదుగుదలకు తగిన రక్షణ చర్యలను కూడా కంపెనీ చేపడుతోంది. పలుచోట్ల గతంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదుగుతున్నాయి. ఈ సారినాటే మొక్కలను కూడా ఇదే విధంగా సంరక్షించాలని యాజమాన్యం అధికారులు, ఉద్యోగులకు పిలుపు నిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.