Take a fresh look at your lifestyle.

Vikarabad (Telangana): Strict action in case of human trafficking: SP M. Narayana

Vikarabad district SP M Narayana has warned that strict action will be taken against those involved in human trafficking, such as illegal human trafficking, buying and selling girls and forcibly moving them to brothels. Government Departments set up today in the Conference Hall of the District Police Office are Ministry of Labor, Women, Child Welfare, Department of Disabled and Elderly, Sarva Shiksha Abhiyan, Ministry of Health, Department of Education, Child Welfare Committee, NGOs Sakhi, Barosa, Response, RPF, Legal. He was the chief guest at a coordination meeting with the Advisor, Child Helpline, Revenue and other departments.

హుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ ఎం. నారాయణ

చట్ట విరుద్ధమైన మానవ అక్రమ రవాణా, అమ్మాయిలను కొనడం,అమ్మడం, బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించడం వంటి హుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎం. నారాయణ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యలయం లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన   ప్రభుత్వ శాఖలు కార్మిక, మహిళా, శిశు సంక్షేమ శాఖ, వికలాంగుల, వృద్ధుల శాఖ, సర్వశిక్ష అభియాన్, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ,  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఎన్‌జి‌ఓ లు సఖి, బారోసా, స్పంధన,ఆర్‌పి‌ఎఫ్, లీగల్ అడ్వైజర్,చైల్డ్ హెల్ప్ లైన్, రెవెన్యూ మరియు ఇతర శాఖలతో సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ  ట్రాఫికింగ్ కు గురైన బాలికలను వ్యభిచార వృత్తిలో దించడం, ఇతర పద్ధతులలో లైంగిక వేధింపులు, బలవంతంగా కార్మికులుగా, సేవకులుగా వినియోగించుకోవడం, నియమించుకోవడం జరుగుతుందని, బాలికలను బలవంతపు వ్యభిచారం వృత్తిలోకి దిప్పడం, శ్రామిక దోపిడి, బలవంతపు యాచక వృత్తి, గృహ సేవల రంగం లో పని చేయుటకు, బలవంతంగా ఇతర పనులకు వాడుకోవడం అనేది హుమెన్ ట్రాఫికింగ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం అని , బాలల, మహిళల హక్కుల అణిచివేత వారిపట్ల తీవ్ర వివక్ష మరియు అసమానతలు, కుటుంబం నుండి రక్షణ లేకపోవడం, తల్లితండ్రులకు గల అప్పులు, సాంఘిక, ఆర్థిక అసమానతలు, వరకట్నం దురాచారం మొదలగునవి హుమెన్ ట్రాఫికింగ్ కు గల కరణాలలో కొన్ని అని, పిల్లలు చిన్న వయసులో ప్రేమలో పడటం, ప్రేమికుడు మోసం చేయడం, ఉద్యోగం పేరుతో మోసం చేసి వృత్తిలో దించడం, పేదరికం వల్ల, తమ కుటుంబన్ని పోషించడం కొరకు, ఇష్టం లేని వారితో పెండ్లి చేయడం మొదలగు కారణాలు ఉండటం వల్ల హుమెన్ ట్రాఫింగ్ పెరుగుతుందని జిల్లా ఎస్‌పి పేర్కొన్నారు.

Anti Human Trafficking Unit టీమ్ ఏర్పాటు

మానవ అక్రమ రవాణా గురించి  ఒక వ్యక్తిని అమ్మడం గాని లేదా కొనడం గాని బలవంతంగాని  18 సంవత్సరాల లోపు బాలలు / బాలికలు వారి అనుమతితో గాని అనుమతి లేకుండా గాని మరియు మహిళలు కూడా  ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మోసం చేసి, మాయా చేసి, ప్రలోభ పెట్టి, కిడ్నాప్ చేసి బలవంతంగా లేదా ఇతర పద్దతులతో అయిన సరే తరలించడాన్ని  మానవ అక్రమ రవాణా అంటారు.

తెలంగాణ రాష్ట్రం లోవుమెన్ సేఫ్టీ వింగ్ ఆద్వర్యం లో 31 ఏహెవచ్‌టి‌యూ (Anti Human Trafficking Unit) లు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా లో కూడా ఒక AHTU టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  వి.దాసు, సి‌సి‌ఎస్ పోలీస్ స్టేషన్, వికారాబాద్ గారిని నియమించడం జరిగింది. ఈ టీమ్ లో ఇద్దరు ఎస్‌ఐ లు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లు, మరియు ఇద్దరు పి‌సి లు ఉంటారు. వీరు జిల్లా లో ఉన్న లాంగ్ పెండింగ్  మిస్సింగ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ కేసులను సేకరించి, విచారించి, ధర్యాప్తు చేసి ఛేదించడం జరుగుతుంది.

భాదితుల సంక్షేమం  సంరక్షణ ను దృష్ఠి లో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ భాదితులు కాకుండా నేరాల నివారణ మరియు అరికట్టడం, నేరస్థులను వారి సహాయకులను కుట్ర దారులు అందరినీ విచారించి శిక్ష పడే విధంగా కార్మిక, మహిళా, శిశు సంక్షేమ శాఖ, వికలాంగుల, వృద్ధుల శాఖ, సర్వశిక్ష అభియాన్, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ,  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఎన్‌జి‌ఓ లు సఖి, బారోసా, స్పంధన,ఆర్‌పి‌ఎఫ్, లీగల్ అడ్వైజర్,చైల్డ్ హెల్ప్ లైన్, రెవెన్యూ మరియు ఇతర శాఖ లతో ఏహెలచ్‌టి‌యూ టీమ్  అనుసంధానం చేస్తూ సమాచారం వస్తే అందరూ కలసి సరిఅయిన చర్యలు తీసుకొని నేరస్థునికి సరి అయిన  శిక్ష పడే విధంగా ఏహెసచ్‌టి‌యూ టీమ్ అతిముఖ్యమైన మౌలికమైన విభాగంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అని, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఏహెమచ్‌టి‌యూ కు సంబంధించిన వాల్ పోస్టర్ లను విడుదల చేయడం జరిగింది.

హుమెన్ ట్రాఫికింగ్ పై అవగాహన అవసరం

ప్రజలలో హుమెన్ ట్రాఫికింగ్ పైన అవగాహన కల్పించి , గ్రామీణ నిరుపేద ప్రజలలో చైతన్యం కలిగించి, పేద ప్రజలకు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలిపి, ప్రపంచంలో చదువు ద్వారా ఏదైనా సాదించవచ్చు అనే విషయాన్ని నమ్మకం కల్గే  విధంగా వారికి చైతన్య పరిచి, చదువుకున్న యువతి యువకులు హుమెన్ ట్రాఫికింగ్ పైన తమ కుటుంబం సభ్యులకు అవగాహన కల్పించాలని,వారు తమ కుటుంబం  వరకే ఆలోచించకుండా సమాజం గురించి కూడా  ఆలోచించి, తమ పరిధి లోని ప్రజలలో చైతన్యం కల్పించాలని,  హుమెన్ ట్రాఫికింగ్ కు సంబందించిన మూలాలు వికారాబాద్ జిల్లా లో ఏ ములాలో కనబడిన 100 నంబర్ కు గాని 1098 మరియు 181  నెంబర్ కు గాని, whats app నెంబర్ 9490617968 కు గాని, ఏహె చ్‌టి‌యూ ఇన్స్పెక్టర్ 9490617965 నెంబర్ కు గాని   సమాచారం ఇవ్వాలని, వికారాబాద్ జిల్లా లో హుమెన్ ట్రాఫికింగ్ రూపు మాపడం లో ప్రతి యొక్క డిపార్ట్మెంట్ వారు కృషి చేయాలని, ఇలాంటి నీచమైన మానవ అక్రమ రవాణా ను అరికట్టడం లో ప్రతి యొక్క వికారాబాద్ జిల్లా పౌరుడు  పాల్గొని పసి మొగ్గాలను కాపాడి వారికి ఉన్నతమైన జీవితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది అని జిల్లా ఎస్‌పి గారు తెలిపినారు.

కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్‌పి ఎం.ఏ రశీద్ గారు, ఏహెాచ్‌టి‌యూ జిల్లా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్  వి.దాసు గారు, డి.‌డబల్యూ.‌ఓ అధికారిని లలిత కుమారి , డి‌.ఈ‌.ఓ రేణుకా దేవి ,బి‌ఆర్‌బి‌ఓ కొ ఆర్డినేటర్  లక్ష్మి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తఃసీల్దార్ దీపక్ ,మెడికల్ డిపార్ట్మెంట్ అరవింద్, లీగల్ ఆఫీసర్ అలిమోద్దీన్, ,సి.‌డబల్యూ.‌సి చైర్మెన్  వెంకటేశం, సంఘమేశ్వర్ , చైల్డ్ లైన్ అధికారి   రామేశ్వర్, బారోసా అధికారిని  నిరోసా , లీగల్ అడ్వైజర్  ఉషా,  ఎస్‌ఐ  కోటేశ్వర్ రావు,  లక్ష్మణ్ నాయక్ , లేబర్ అధికారి  ప్రసన్న , ఆర్‌.పి‌.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్   వీర స్వామి, సిబ్బంది తరితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.