Take a fresh look at your lifestyle.

CMD N Sridhar planted a sapling inaugurates Singareni Vrukshostavam

2.35 lakh plants in a single day during the tree festival under the auspices of Singareni

4.6 crore plants for Telangana Ku Harithaharam so far

ప్రకృతి సమత్యులతను కాపాడటానికి, హరిత తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన తెలంగాణాకు హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణహిత కార్యక్రమమని దీనిలో భాగంగా సింగరేణి సంస్థ గత ఐదేళ్ల కాలంలో 4 కోట్ల 60 లక్షల మొక్కలు నాటిందని, ఈ ఒక్కరోజునే సింగరేణి వృక్షోత్సవం పేరుతో సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల 35 వేల మొక్కలు నాటడం తమకెంతో సంతోషంగా ఉందని సింగరేణి సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.

హైద్రాబాద్ సింగరేణి భవన్లో సింగరేణి సంస్థ తపెట్టిన 2 లక్షల మొక్కలు నాటే ‘సింగరేణి వృక్షోత్సవం కార్యక్రమాన్ని ఆయన మొక్కనాటి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో తలపెట్టిన  తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో సింగరేణి తొలి సంవత్సరం నుండే మొక్కలు నాటుతూ వస్తోందన్నారు. 2015 లో 40 లక్షల మొక్కలు, 2016 లో ఒక కోటి మొక్కలు, 2017లో ఒక కోటి 10 లక్షల మొక్కలు, 2018లో 90 లక్షల 31 వేల మొక్కలు, 2019లో 80 లక్షల 31 వేల మొక్కలు, 2020లో 35 లక్షల మొక్కలు నాటిందని, ఇప్పటి వరకూ 4,522.5 హెక్టార్లలో 4 కోట్ల 60 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు.

సింగరేణి సంస్థ ప్రతీ ఏడాది మొక్కలు నాటడం కోసం 11 ఏరియాల్లో ప్రతీ చోటా నర్సరీలు ఏర్పాటు చేసి, అడవుల్లో అంతరించి పోతున్న వృక్ష జాతుల మొక్కలకు పునర్జీవనం కలిగిస్తోందనీ, ఈ తరహా మొక్కలను ఓ.బి. డంపుల మీద అడవుల మాదిరిగా పెంచుతున్నామని వివరించారు. సింగరేణి సంస్థ తాను మొక్కలు పెంచడమే కాక గ్రామాల్లో పండ్లు, పూలనిచ్చే మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామనీ, ఈ మొక్కలను సమీప గ్రామాల ప్రజలు ఎంతో శ్రద్ధతో పెంచుతున్నారని పేర్కొన్నారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ అడ్వయిజర్ (మైనింగ్)  డి.ఎన్.ప్రసాద్, అడ్వయిజర్ (ఫారెస్ట్రీ)  కె.సురేంద్రపాండే, జనరల్ మేనేజర్ (కో-ఆర్డినేషన్) కె.రవిశంకర్ లు పాల్గొన్నారు. అన్ని ఏరియాల్లో కలిపి 2.35 లక్షల మొక్కలు నాటాగా సింగరేణి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జి.ఎం.లు గుర్తింపు కార్మిక సంఘం నాయకులు వివిధ ఏరియాల్లో జరిగిన సింగరేణి వృక్షోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్మికులు విద్యార్ధులు, యువకులు, మహిళలు కూడా పాల్గొన్నారు. డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా)  ఎస్.చంద్రశేఖర్ కొత్తగూడెం ఏరియాలోనూ, డైరెక్టర్ (ఫైనాన్స్ & పి&పి) ఎన్.బలరామ్తో పాటు భూపాలపల్లి ఇంచార్జ్ కలెక్టర్ కృష్ట ఆదిత్య భూపాలపల్లిలోనూ, డైరెక్టర్ (ఇ&ఎం)  డి.సత్యనారాయణరావు ఆర్.జి.-3 ఏరియాలో కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. డైరెక్టర్ (ఫైనాన్స్ మరియు పి&పి)  ఎన్.బలరామ్ సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 9,999 మొక్కలు నాటగా బుధవారం నాటి కార్యక్రమంలో ఆయన కెటికె-5 ఇంక్లైన్ వద్ద స్వయంగా 625 మొక్కలు నాటి 10 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేధించారు.

సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల 35 వేల మొక్కలు

సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో సింగరేణి వృక్షోత్సవంలో భాగంగా ఈ రోజు 2.35 లక్షల మొక్కలు నాటడం జరిగింది. వీటిలో కొత్తగూడెం రీజియన్ లోని కార్పోరేట్ లో 5 వేల మొక్కలు, మణుగూరులో 13,500 వేల మొక్కలు, కొత్తగూడెంలో 1 వెయ్యి మొక్కలు, ఇల్లందులో 1 వెయ్యి మొక్కలు, రామగుండం రీజియన్లోని రామగుండం-1లో 10,100 మొక్కలు, రామగుండం-2లో 6 వేల మొక్కలు, రామగుండం-3 & అడ్రియాలలో 18,550 వేల మొక్కలు, భూపాలపల్లిలో 11,820 వేల మొక్కలు, బెల్లంపల్లి రీజియన్ లోని బెల్లంపల్లి ఏరియాలో 41,200 మొక్కలు, మందమర్రిలో 59 వేల మొక్కలు, శ్రీరాంపూర్ లో 63 వేల మొక్కలు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 5 వేల మొక్కలు నాటారు.

Leave A Reply

Your email address will not be published.