Mining industries major changes with IT usage, unexpected growth: Singareni Director S. Chandrasekhar
Mr. S. Chandrasekhar Director, (Operations & PAW) Singareni said that the efficient use of information technology in the mining industry can lead to unprecedented growth along with increased production and protection.
మైనింగ్ పరిశ్రమలు ఐటీ వినియోగంతో పెనుమార్పులు ,అనూహ్య వృద్ధి: సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్
మైనింగ్ పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని సమర్థంగా వినియోగించడం వల్ల ఉత్పత్తి, రక్షణ పెరుగుదలతో పాటు అనూహ్యమైన ప్రగతిని సాధించవచ్చని ,దీనికి ఒక ఉదాహరణగా సింగరేణి నిలుస్తుందని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పి. ఏ.డబ్ల్యు శ్రీ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ నుండి అల్యూమ్ని ఆఫ్ మైనింగ్ ఇంజనీర్స్ (ఉస్మానియా మరియు కాకతీయ యూనివర్సిటీ)లు ఉస్మానియా మైనింగ్ ఇంజనీరింగ్ శాఖల సంయుక్తంగా ఈ రోజు నిర్వహించిన “మైనింగ్ పరిశ్రమల్లో ఐటి వినియోగం -” అనే అంశంపై వెబినార్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు ఐటీ వినియోగం వల్ల మైనింగ్ పరిశ్రమల్లో ఒనగూడే ప్రయోజనాలను వివరించారు .
ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపులు కూలిపోకుండా పర్యవేక్షించడానికి ఐటి అప్లికేషన్ గల లే డార్ అనే యంత్రాలను సింగరేణి వినియోగి స్తోందని,తద్వారా అత్యంత సూక్ష్మ కదలికను సైతం గుర్తించి ప్రమాదాల నివారణకు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుని అవకాశం కలుగుతోందన్నారు..
భారీ యంత్రాల వినియోగం పై పర్యవేక్షణ,
గనిలో పరస్పర కమ్యూనికేషన్ కు అవకాశం ,తద్వారా ప్రమాదాల నివారణకు ఉత్పాదకత పెంపుదలకు నేడు వస్తున్న ఐటీ చోదిత అప్లికేషన్లు ,యంత్రాలు ఎంతగానో దోహదపడనున్నాయని సోదాహరణంగా గా వివరించారు .ఐటీ వినియోగం వల్ల మైనింగ్ సంస్థలు అనూహ్యమైన వృద్ధిని సాధించే అవకాశం ఉందని వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి, సింగరేణి లో ఐటీ వ్యవస్థాపకులు , సింగరేణి మాజీ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ & ప్లానింగ్ భాస్కర్ రావు వేబినార్ లో వెల్లడించిన అంశాలపై సమీక్షించారు . అల్యూ మ్ని నాయకులు డాక్టర్ ఎం ఎస్ వెంకట రామయ్య, కేజీ అమర్నాథ్ సారథ్యం లో నిర్వహించిన ఈ వెబినార్ లో డాక్టర్ ఎం రమణ, డాక్టర్ కార్తీక్, టి మహేష్ ,జయేష్, జనరల్ మేనేజర్ హెచ్ ఆర్ డి కే గురవయ్య, డిప్యూటీ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తదితరులు తమ పరిశోధనా అంశాలు వివరించారు.దేశ వ్యాప్తంగా గా వందలాది మైనింగ్ ఇంజనీర్లు దీనిలో పాల్గొన్నారు