Take a fresh look at your lifestyle.

Power generation at Singareni solar plants should be at maximum level

Singareni E&M Mr. D. Satyanarayana Rao urged the representatives and subsidiaries of Bharat Heavy Electricals Ltd., the main agency for operations and maintenance, to take due care to ensure maximum production at the solar power plants completed in the first phase at Singareni. Today he was speaking at the B.H.E.L.review on the first phase solar plant operation and maintenance works, duty policies with the subsidiary company representatives.

సింగరేణి సోలార్‌ ప్లాంటుల్లో విద్యుత్‌ ఉత్పాదన గరిష్ట స్థాయిలో ఉండాలి

ఓ&ఎం ఏజెన్సీలకు డైరెక్టర్‌ ఇ&ఎం శ్రీ డి.సత్యనారాయణరావు సూచన

సింగరేణి సంస్థలో మొదటి దశలో పూర్తయిన సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లలో గరిష్ట స్థాయిలో ఉత్పాదన ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి ఇ&ఎం శ్రీ డి.సత్యనారాయణ రావు ఆపరేషన్స్‌ మరియు మెయింటనెన్సు ప్రధాన ఏజెన్సీ అయిన భారత్‌ హెవీ ఎక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులను, అనుబంధ ఏజెన్సీలను కోరారు. గురువారం (మార్చి 4వ తేదీ) హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌లో ఆయన బి.హెచ్‌.ఇ.ఎల్‌. మరియు అనుబంధ సంస్థ ప్రతినిధులతో మొదటిదశ సోలార్‌ ప్లాంటు ఆపరేషన్‌ మరియు మెయింటనెన్సు పనులు, విధి విధానాలపైన సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిదశ నిర్మాణంలో గల 129 మెగావాట్ల ప్లాంటుల్లో రామగుండం-3 ఏరియాలో 50 మెగావాట్లు, ఇల్లందులో 39 మెగావాట్లు, మణుగూరులో 30 మెగావాట్లు, ఎస్‌.టి.పి.పి.లో 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంటుల నుండి సోలార్‌ విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరగనున్న నేపథ్యంలో ఈ నాలుగు ప్లాంట్లలో చేపట్టాల్సి ఉన్న సాధారణ ఆపరేషన్‌ మరియు మెయింటనెన్సు పనులు మంచి నాణ్యతతో చేపట్టాలనీ, రక్షణ ప్రమాణాలను విధిగా పాటించాలని, ముఖ్యంగా కెపాసిటీ యూటిలైజేషన్‌ ఫాక్టర్‌ (సి.యు.ఎఫ్‌.) గరిష్టంగా ఉండేలా మొదటినుండే పకడ్భందీగా చర్యలు చేపట్టాలనీ సూచించారు.

సింగరేణి సంస్థ మొదటిదశలోని ప్లాంటు ఓ&ఎం పనులను బి.హెచ్‌.ఇఎల్‌.కు అప్పగించగా ఆ సంస్థ తిరిగి ఆరు ప్రైవేటు సంస్థలకు ఈ పనులను కేటాయించింది. వీటిలో ఫ్యూచర్‌ సోలార్‌, సన్‌ టెక్నాలజీస్‌, సోలారీస్‌, కూనంనేని టెక్నాలజీస్‌, యు.టి. భోపాల్‌ మరియు ల్యాంబోర్న్‌ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థ వారు ఓ&ఎం పనులకు తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలనీ, కావాల్సిఉన్న స్పేర్లు, పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని డైరెక్టర్‌ (ఇ&ఎం) సూచించారు. సమావేశంలో పాల్గొన్న బి.హెచ్‌.ఇ.ఎల్‌. ప్రతినిధు మాట్లాడుతూ సింగరేణి సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం ఓ&ఎం పనులను తాము బాధ్యతయుతంగా చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఇ&ఎం శ్రీ డి.సత్యనారాయణ రావుతో పాటు జి.ఎం. (సోలార్‌) శ్రీ డి.వి.ఎస్‌.ఎస్‌.ఎన్‌. రాజు, కన్సల్టెంట్‌ శ్రీ మరళీధరన్‌, ఏరియా ఇంజనీర్లు శ్రీ ఎలీషా, శ్రీ ఫిజిరాల్డ్‌, శ్రీ ప్రభాకర్‌ రావు, డి.వై.జి.ఎం. శ్రీ శ్రీనివాస్‌ లు, బి.హెచ్‌.ఇ.ఎల్‌. నుండి ఎ.జి.ఎం.ు శ్రీ రామచంద్ర, శ్రీ సుభాష్‌ బన్వాలికర్‌ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.