Take a fresh look at your lifestyle.

సింగరేణి: ఇల్లందు సోలార్ ప్లాంట్ ద్వారా 39 మెగావాట్ల విద్యుత్తు అనుసంధానం

The first phase of the 300 MW solar plant being built by Singareni Calories Company Ltd. The plant under construction in the Illandu area is fully ready and the company’s directors connected the 39 MW of power generated from the plant to the TS Transco substation on Saturday evening.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్మిస్తున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ లలో తొలి దశ కు సంబంధించి ఇల్లందు ఏరియా లో నిర్మిస్తున్న ప్లాంటు పూర్తిస్థాయిలో సిద్ధం కాగాఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి 39 మెగావాట్ల విద్యుత్తును శనివారం సాయంత్రం సంస్థ డైరెక్టర్లు టి ఎస్ ట్రాన్స్కో సబ్ స్టేషన్ కు అనుసంధానం చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్. డైరెక్టర్ ఈ&ఎం శ్రీ డి సత్యనారాయణ రావు మాట్లాడుతూ దేశంలో ఏ   బొగ్గు కంపెనీ లో లేని విధంగా సింగరేణి సంస్థలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పటం జరుగుతుందని ,సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం మూడు దశల్లో ని అన్నిప్లాంట్ లను పూర్తి చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు.

సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సింగరేణి సంస్థ తన అవసరాలకు కూడా వినియోగించుకుంటుందని, దానివలన తక్కువ ధరకే విద్యుత్తు లభించడంతో  సంస్థకు భారీగాలాభం చేకూరుతుందని తెలిపారు.

మొదటి దశలో ఇంకా మిగిలి ఉన్న రామగుండం మూడు ఏరియాలోని 50 మెగావాట్ల  ప్లాంట్ నుండి మిగిలిన 20 మెగావాట్ల విద్యుత్తును ఈ నెలాఖరుకల్లా అనుసంధానం చేస్తామని..దీంతో మొదటి దశలో 129 మెగావాట్లవిద్యుత్తు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

సి ఎం డి డి శ్రీ ఎం శ్రీధర్ అభినందనలు.

ఇల్లందు రోడ్డు 39 మెగావాట్ల ప్లాంట్ నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన జరగడంపై సంస్థ చైర్మన్ మరియు శ్రీధర్ తన హర్షం ప్రకటించారు ఇదే విధంగా మొదటి దశ లోని 129 మెగావాట్ల విద్యుత్తును ఈ నెలాఖరుకల్లా అనుసంధానం చేయాలని మిగిలిన రెండు దశల్లోనూ ప్లాంట్లను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను నిర్మాణ సంస్థను కోరారు

ఈ కార్యక్రమంలో ఇంకా  బి.హెచ్.ఈ. ఎల్. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇంచార్జ్ రామచంద్రన్ మరియు జెన్కో ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.