Take a fresh look at your lifestyle.

Hyderabad: HMWSSB bags Excellence Award for Rainwater Harvesting

Hyderabad Metropolitan Water Supply and Sewerage Board received the Excellence Award at the Second National Water & Sanitation Innovation Summit organized by the Union Ministry of Water Energy in association with Namami Ganga Mission under the auspices of ELETS.

The event, which was held in a virtual manner in Kerala today, was held in the Innovation in Rainwater Harvesting category. The award was given for the construction of Theme park built in road no 51, Jublee hills, Hyderabad. Minister of State for Water Supply Ratan Lal Kataria presented the award to Mr.Dana Kishore Managing Director,Hyderabad Metropolitan Water Supply and Sewerage Board.

.కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, న‌మామి గంగే మిష‌న్ స‌హ‌కారంతో ఎలెట్స్ సంస్థ‌ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ రెండవ నేష‌న‌ల్ వాట‌ర్ & సానిటేష‌న్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ లో జ‌ల‌మండ‌లికి ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది.

ఈ రోజు కేర‌ళ లో వర్చ్యువల్ విధానం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్నోవేష‌న్ ఇన్ రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ కేట‌గిరిలో… రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్, నీటి పొదుపు మ‌రియు సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల అవ‌గాహ‌న కోసం జ‌ల‌మండ‌లి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51 లో నిర్మించిన థీమ్ పార్కు నిర్మాణానికి గాను ఈ అవార్డు ల‌భించింది. వర్చ్యువల్ విధానం లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల్ శక్తి స‌హాయ మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా ఈ అవార్డును జ‌ల‌మండ‌లి ఎండీ శ్రీ. దాన కిశోర్ ఐఏఎస్ గారికి బ‌హుక‌రించారు.
2018 ద‌స‌రా రోజు ప్రారంభమైన థీమ్ పార్కు:
న‌గ‌ర‌వాసుల‌కు ఇంకుడుగుంత‌లు, నీటి పొదుపుపై అవ‌గాహన క‌ల్పించేందుకు నిర్మించిన రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును తేది.18.10.2018, గురువారం రోజున‌ అప్ప‌టి తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ. ఎస్.కె. జోషి గారి చేతుల మీదుగా ప్రారంభ‌మైంది.

Midle of the post

దాదాపు రూ. 3 కోట్ల‌తో నిర్మించిన ఈ థీమ్ పార్కు లో భ‌వ‌నాల్లో, కాలువ‌ల్లో ఏ విధంగా నీటి పొదుపు చేయ‌వ‌చ్చో తెలియ‌జేసే నిర్మాణాలు ఉంటాయి.

అలాగే నీటిని సంర‌క్షించే ప‌ద్దతులు, నీటిని ఓడిసి ప‌ట్టే ప‌ద్దతులకు చెందిన‌ 42 ర‌కాల న‌మూనాలు ఈ పార్కులో నిర్మించ‌బ‌డ్డాయి. పిల్లలకు నీటి విలువ‌ను గురించి తెలియ‌జేసే యానిమేష‌న్ విడియోలు, కృష్ణా, గోదావ‌రి న‌దుల నుంచి హైద‌రాబాద్ మ‌హాన‌గరానికి మంచినీటిని త‌ర‌లిస్తున్న త్రీడి రూపంలో ఉన్న‌ వీడియోలు ఇందులో ప్ర‌ద‌ర్శిస్తారు.

నీటి సంర‌క్ష‌ణ కొర‌కు ఈ పార్కులో ఏర్పాటు చేసిన నిర్మాణాలు విద్యార్థుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా.. మాట్లాడే చెట్టు విద్యార్థుల‌ను క‌ట్టిపడేస్తుంది. ఈ చెట్టు, అడ‌వుల వల్ల వ‌ర్షాలు ఎలా కురుస్తాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు అడ‌వుల వ‌ల్ల‌ ప్ర‌యోజ‌నాల‌ను గూర్చి వివ‌రిస్తుంది.

అలాగే ఈ పార్కులో గొడుగు ఆకారంలోని నాలుగు గ‌జెటోల‌ను నిర్మించారు. వాన‌నీరు వీటిపై ప‌డ‌గానే ఆ నీరు ప్ర‌క్క‌నే ఉన్న సంపులోకి వెళ్లేలా ఏర్పాటుచేశారు. అలాగే విద్యార్థుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లు ర‌కాల ఆట‌ల‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇక్క‌డ ఏర్పాటుచేసిన భారీ స్కేలుపై మ‌నిషి నిల‌బ‌డితే ఆ వ్య‌క్తి ఒంట్లో ఎంత నీరు ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. వీటితోపాటు 5 నిమిషాల నిడివితో కూడిన‌ వాన‌నీటి సంర‌క్షణ చ‌ర్య‌లు సులువుగా అర్థ‌మ‌య్యేలా చోటాభీమ్ వీడియోలు రూపొందించారు.

అలాగే కృష్ణా, గోదావ‌రి న‌దుల నుంచి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మంచినీటిని త‌ర‌లిస్తున్న ప‌ద్ద‌తిని వివ‌రించే వాట‌ర్ జ‌ర్నీ చాలా సుల‌భంగా విద్యార్థుల‌కు అర్ద‌మ‌య్యే రీతిలో ఉంది. వీటి ద్వారా ప్ర‌తి నీటి బొట్టు విలువ‌ను ప్ర‌తి ఒక్క విద్యార్ధి తెలుసుకునే వీలుంటుంది.

2018 లో ప్రారంభ‌మైన ఈ పార్కును..ఇప్ప‌టివ‌ర‌కు దేశ విదేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌తినిధులు అలాగే న‌గ‌రంలోని ప‌లు క‌ళాశాల‌, పాఠ‌శాలకు చెందిన‌ ఇర‌వై వేల మందికి పైగా విద్యార్థులు సంద‌ర్శించారు. అలాగే కాన్పూర్, త‌మిళ‌నాడుల‌లో ఈ త‌ర‌హా థీమ్ పార్కును నిర్మించు కోవ‌డానికి జ‌ల‌మండ‌లి నుంచి థీమ్ పార్కుకు చెందిన‌ సాంకేతిక, నిర్మాణ వివ‌రాల‌ను సంబందిత అధికారులు సేక‌రించారు.

 

Leave A Reply

Your email address will not be published.