Take a fresh look at your lifestyle.

Singareni pre-army recruitment camps which gave good results

73 young men from Singareni area who were selected till the written test for jobs in the Army.

The Singareni organization has recently conducted pre-army recruitment camps in 10 areas with the aim of providing job opportunities to the youth in the nearby villages with good results.

సికింద్రాబాద్ కు సమీపంలోని హకీంపేట లో మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో సింగరేణి ద్వారా శిక్షణ పొందిన యువకుల్లో  96 మంది శరీరదారుడ్య పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు అనంతరం జరిగిన మెడికల్ పరీక్షలో వీరి నుండి 73 మంది  ఉత్తీర్ణులై ఫైనల్ రాత పరీక్షకు ఎంపికయ్యారు. దీనిపై సేవా సమితి ఉపాధ్యక్షులు మరియు జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ కే. సూర్యనారాయణ ,సేవా సమితి సింగరేణి వ్యాప్త చీఫ్ కోఆర్డినేటింగ్ఆఫీసర్ శ్రీ మహేష్ లు హర్షం వ్యక్తం చేశారు.

ప్రాథమిక పరీక్షల్లో ఎంపికైన 73 మంది మే నెలలో జరగనున్న రాత పరీక్షకు సిద్ధమవుతున్నారు.

కోవిడ్ వ్యాధి తిరిగి ఉధృతమవుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈ ఏడాది సింగరేణి సంస్థ రాత పరీక్ష నిర్వహించ లేక పోతోందని అయితే అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా సహకరించనున్నామని తెలిపారు .

ఎంపికైన 73 మంది లో జనరల్ డ్యూటీ సోల్జర్ విభాగానికి 41 మంది,

ట్రేడ్స్ మెన్ విభాగానికి 27 మంది, నర్సింగ్ మరియు క్లర్కుల విభాగానికి ఐదుగురు ఎంపికయ్యారు.ఎంపికయిన వారిలో 5 గురు కార్మిక కుటుంబాల నుండి రాగా మిగిలినవారంతా  సమీప గ్రామాలు, పట్టణాలకు చెందిన రైతు , రైతు కూలీ కుటుంబాల కు చెందిన వారే!!

రాత పరీక్షలో కూడా దాదాపు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు అవుతారని భావిస్తున్నారు

నెల ఇరవై రోజుల పాటు  ఏరియాల్లో ఉచిత  శిక్షణ.

సింగరేణి సమీప పట్టణాలు, పల్లెల్లోని నిరుద్యోగులైన యువకులకు  వివిధ రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్న సింగరేణి సంస్థ ఆర్మీ పట్ల ఆసక్తి గల అభ్యర్థులకు దీనిలో చేరడానికి ప్రతిఏడాది ఉచిత శిక్షణ శిబిరాలను గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ శిక్షణ శిబిరాలవలన ఇప్పటికే సుమారు పదకొండు వందల మందికి పైగా యువకులు ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు .వీళ్లంతాదేశంలో నీ   వివిధ ప్రాంతాలలో, దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లను స్ఫూర్తిగా తీసుకున్న సింగరేణి ప్రాంతంలోని ఇతరనిరుద్యోగ యువకులు సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలకు తరలి వస్తూ  ఉచిత శిక్షణ పొందుతున్నారు.

గత ఏడాది సంస్థ చైర్మన్ మరియుఎండి శ్రీ ఎన్ .శ్రీధర్ సూచన మేరకు తొలిసారిగా మూడు నెలలపాటు రెసిడెన్షియల్ తరహా శిక్షణను కూడా సింగరేణి సేవా సమితి ద్వారా అందించారు. 300 మందిని ఎంపిక చేసి భోజన వసతులు సమకూర్చి శిక్షణ ఇచ్చారు .ఫలితంగా గత ఏడాది జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో272 మంది యువకులు పాల్గొనగా వీరిలో శరీర దారుఢ్య  పరీక్షల్లో162మంది ఉత్తీర్ణులు కాగా తదుపరి వైద్యపరీక్షల్లో114 మంది పాసయినారు .ఆ తర్వాత జరిగిన రాతపరీక్షల్లో  35 మందివిజయులై ఉద్యోగాలు సాధించారు .

అయితే ఈ ఏడాది కరోనా వ్యాధి నేపథ్యం లో రోజువారీగా ఉదయం సాయంత్రం శరీర దారుఢ్యం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు  .500 మంది యువకులు ఈ శిబిరాల లో పాల్గొన్నారు వీరిలో ప్రధానంగా సమీప గ్రామాలకు పట్టణాలకు చెందిన రైతులు నిరుద్యోగుల  పిల్లలు ,మాజీ ఉద్యోగుల పిల్లలు కొందరు ఉన్నారు. హకీం పేట లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో వీరంతా పాల్గొనడం కోసం సింగరేణి సంస్థ ఈ ప్రాంతానికి సమీపంలో ఒక ఒక హాలుని  అద్దెకు తీసుకొని ఉచిత భోజన ,వసతి సౌకర్యాన్ని అభ్యర్థులకు కల్పించింది సేవా సమితి ఇచ్చిన శిక్షణ ,కల్పించిన సౌకర్యాల వల్లఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చాటారు.శరీర దారుడ్య, వైద్యపరీక్షల్లో 73మంది ఎంపికయ్యారు రాత పరీక్షలు కూడా తాము ఎన్నిక అవుతామని ఉద్యోగాలు సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు సింగరేణి సంస్థ తమను సొంత బిడ్డలు చూసుకుని ఉచిత శిక్షణ సౌకర్యాలు కల్పించడం పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు

 

Leave A Reply

Your email address will not be published.