Dr.B.R.Ambedkar Jayanti celebrations under the auspices of Singareni
Bharat Ratna Dr. BR Ambedkar’s 130th birth anniversary was celebrated all over Singareni today.
భారతరత్న డా॥ బి.ఆర్.అంబేద్కర్ వివిధ జాతుల అభివృద్ధికి, ఉన్నతికి సూచించిన ఉన్నత ఆశయాలను ఆచరించి చూపడమే ఆయనకు మనం సమర్పించే నిజమైన నివాళి అని సింగరేణి జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ & మార్కెటింగ్ శ్రీ కె.సూర్యనారాయణ అన్నారు. హైద్రాబాద్ సింగరేణి భవన్ లో బుధవారం (ఏప్రియల్ 14వ తేదీ)న పెద్దఎత్తున నిర్వహించిన 130వ అంబేద్కర్ జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచని హక్కులు , తద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేయాలని కోరారు. సింగరేణి సంస్థ అంబేద్కర్ జన్మదినాన్ని సెలవుగా ప్రకటించిందనీ, ఆయన జయంతిని అన్ని ఏరియాల్లో ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్వేచ్ఛ మన భారతదేశంలో ఉందనీ, దీనికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులే అని పేర్కొన్నారు.

సింగరేణి అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ ఎన్.వి.రాజశేఖర్ రావు మాట్లాడుతూ అణగారిన దళిత, పేద వర్గాలను పైకి తీసుకురావడం ద్వారా దేశంలో సాంఘిక సమానత్వం తేవాలన్న ఉన్నత లక్ష్యంతో రాజ్యాంగంలో ఈ వర్గాల వారికి అనేక హక్కులను అవకాశాలను అంబేద్కర్ కల్పించారనీ, నేడు దేశంలో బి.సి., ఎస్.సి., ఎస్.టి. దళిత కులాల వారు చదువుకోవడానికీ, ఉద్యోగాలు పొందడానికి ఆయన రాజ్యాంగంలో పొందుపరచిన హాక్కులే ప్రధాన కారణమన్నారు.
సింగరేణి ఎస్.సి., ఎస్.టి., బి.సి. ఉద్యోగుల సంఘం కోశాధికారి శ్రీ బోడ భద్రు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విదానాన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశించిన విధంగా దళిత పేద వర్గాల వారు రాజ్యాధికారంలో ప్రధాన భాగస్వాములుగా ఎదగాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. సింగరేణి సంస్థ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలులో ఎంతో ముందుందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.
అంబేద్కర్ పై నిర్వహించిన వ్యాస రచన, వాక్యత పోటీల్లో విజేతలైనవారికి ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. అలాగే అవుట్ సోర్సు ఉద్యోగులకు కూడా మొమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లైజన్ ఆఫీసర్ మరియు పి.ఆర్.ఓ. శ్రీ బి.మహేష్ పాటలు పాడారు. డి.జి.ఎం. పర్చేజ్ శ్రీ డి.విజేందర్ రెడ్డి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఎన్.భాస్కర్, అడిషనల్ మేనేజర్ శ్రీ డి.వెంకటేషం, ఎస్.ఇ. శ్రీ సంజీవరెడ్డి, విజయకుమార్ తదితరులు తమ సందేశమిచ్చారు..