Take a fresh look at your lifestyle.

All the information of Singareni Seva Samithi is now in web application: Vice President K. Suryanarayana

General Manager Co-ordination in Video Conference

Mr. K. Suryanarayana, General Manager Co-ordination and Vice President, Singareni Seva Samithi, clarified that from now on, the IT department will be required to include all the information on the management and expenditure of the Singareni Seva Samithi programs in 11 areas in six districts across Singareni.

సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో 11 ఏరియాల్లో నిర్వహిస్తున్న సింగరేణి సేవా సమితి కార్యక్రమాల నిర్వహణ, ఖర్చులు తదితర సమాచారం మొత్తం ఇకనుండి విధిగా ఐటి విభాగం వారు రూపొందించిన వెబ్ అప్లికేషన్ లోని పొందుపరచాల్సి ఉంటుందని జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్, సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు కే.సూర్యనారాయణ స్పష్టం చేశారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల సింగరేణి సేవా సమితి నిర్వాహక అధికారులు, కో-ఆర్డినేటర్ లతో ఏప్రిల్ 21వ తేదీన సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.

సింగిరేణి సేవా సమితి ద్వారా ప్రతి ఏడాది అన్ని ఏరియాల్లో నిరుద్యోగులైన యువతీ యువకుల కోసం అనేక రకాల ఉపాధి అవకాశ శిక్షణలు ఇస్తున్నామని, అలాగే హైదరాబాద్ వంటి చోట కూడా ప్రత్యేక నైపుణ్య శిక్షణలు ఇస్తున్నామని, అలాగే మహిళా సాధికారికత లో భాగంగా ప్రత్యేక శిక్షణలు కూడా ఇస్తున్నామని, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇకపై తప్పనిసరిగా సేవా సమితి వెబ్ అప్లికేషన్ లో పొందుపరచాలని కోరారు.

శిక్షణ కోసం దరఖాస్తుచేసుకున్న వారి పేర్లు కూడా దీనిలో నమోదు చేయాలని, ఈ వెబ్ అప్లికేషన్ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడి ఉంది కనుక బోగస్ అభ్యర్థులను గుర్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సేవా సమితి ద్వారా ఇప్పటివరకు ఎన్ని శిక్షణ లు ఇచ్చాము, తద్వారా ఎంతమంది శిక్షణ పూర్తి చేశారు అనే సమాచారం తో పాటు స్వయంగా ఎందరు ఉపాది యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు అనే విషయం కూడా ఈ వెబ్ అప్లికేషన్ లో తెలిసిపోతుందని తెలిపారు.

సేవా సమితి శిక్షణ కోసం చేస్తున్న ఖర్చు తదితర వివరాలు కూడా దీనిలోని పొందుపరచాలని పేర్కొన్నారు. ఈ వెబ్ అప్లికేషన్ వల్ల సేవా సమితి కార్యక్రమాలు మొత్తం క్రోడీకరించిబడి పూర్తిసమాచారం తక్షణమే లభ్యం అవుతుందని వివరించారు.

ఈ వెబ్ అప్లికేషన్ ను సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ ఇటీవలనే ఆవిష్కరించారని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని దీని ద్వారా సమర్పించిన ప్రతిపాదనలు, వివరాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ కార్యాలయం నుంచి ఆయనతో పాటు సింగరేణి వ్యాప్త సేవా సమితి చీఫ్ కో-ఆర్డినేటింగ్ ఎగ్జిక్యూటివ్ మరియు చీఫ్ లైజన్ ఆఫీసర్ శ్రీ బి.మహేష్, శ్రీ కిషోర్, శ్రీ శివ కుమార్, కొత్తగూడెం నుండి ఐటీ మేనేజర్ హరిశంకర్, సీనియర్ ప్రోగ్రామర్ రేష్మ, అన్ని ఏరియాల నుంచి సేవాసమితి కో-ఆర్డినేటింగ్ అధికారులు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.