Take a fresh look at your lifestyle.

Singareni: Don’t lose a single worker due to Covid: CMD N. Sridhar

Vaccination of all Singareni workers in another 30 days: A total of 1200 beds should be prepared in Kovid special wards and quarantine centers across Singareni: Large-scale Covid Rapid Tests should be conducted: Drugs should be injected, oxygen should be provided: Necessary doctors and health staff should be recruited on contract basis: Directors of the Company, Singareni CMD N Sridhar Directions to the Medical Department.

కోవిడ్ వ్యాధి తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు రాపిడ్ టెస్ట్లను పెద్ద ఎత్తున నిర్వహించడంతోపాటు రోజుకు రెండు వేల మంది చొప్పున మరో 30 రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా అందరు కార్మికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంస్థ చైర్మన్ మరియు ఎం డి శ్రీ ఎన్ శ్రీధర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ వ్యాధి నివారణపై ఈ రోజు సమీక్షించారు.

సింగరేణి సంస్థలో వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 692 బెడ్లు ఉన్నాయని వీటిలో 312  బెడ్ లను క్వారంటైన్ కోసం ప్రత్యేకించి ఉంచాలని 387 బెడ్ లను కోవిడ్ ప్రత్యేక వార్డు గా గుర్తించాలని ,వీటికి అదనంగా మరో ఐదు వందలు బెడ్లనులను వెంటనే సమకూర్చుకోవాలని చైర్మెన్ ఆదేశించారు.

ఇప్పటికే సింగరేణిలో 95 వేల మందికి రాపిడ్ కొవిడ్ పరీక్షలు నిర్వహించామని, అయితే మరో 25 వేల పరీక్షలునిర్వహించడం కోసం ప్రభుత్వం నుండి కిట్లను వెంటనే సమకూర్చుకోవాలని ,దీనికి సంబంధించి తాను వైద్య శాఖ మంత్రిని  కోరనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు విశాఖపట్నం నుండి వీటిని వెంటనే సమకూర్చుకోవాలని ఆదేశించారు.

పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించి కొవిడ్ పాజిటివ్ ఉన్న వారిని తక్షణమే క్వారంటయిన్  సెంటర్లకు తరలించాలని, తీవ్రత తక్కువగా ఉన్నవారు హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి ఇష్టపడుతున్నట్లయితే వారికి. క్వారంటిన్ కిట్లను అందజేయాలని ఆదేశించారు.

సింగరేణి వ్యాప్తంగా కోవిడ్ వార్డులు, క్వారంటైన్ సెంటర్ లలో సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు అవసరమైతే కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను, వార్డుబాయ్ నర్సులను తక్షణమే నియమించుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. హైదరాబాదులో ఇప్పటికే కోవిడ్ అత్యవసర సేవల కోసం  వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో సింగరేణి పేరిట ఉన్న బెడ్ల ను రెట్టింపు చేయాలని, వ్యాధి తీవ్రత ఉన్న ప్రతి పేషెంట్ను వెంటనే హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు.

కోవిడ్ వ్యాధి కారణంగా సింగరేణి కుటుంబంలో ఎవరు మృతి చెంద కూడదు అనే లక్ష్యంతో అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు . ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా కొవిడ్   వ్యాధిని ఎదుర్కోవాలని ఆదేశించారు.

ఈ వీడియో సమావేశంలో కొత్తగూడెం నుండి డైరెక్టర్ ఆపరేషన్స్ & పా  శ్రీ ఎస్ చంద్రశేఖర్ ,మణుగూరు నుంచి (డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) శ్రీ ఎన్.బలరాం, హైదరాబాద్ కార్యాలయం నుండి చైర్మన్ తో పాటు జనరల్ మేనేజర్ (కో-ఆర్డినేషన్ మరియు మార్కెటింగ్) శ్రీ కే.సూర్యనారాయణ, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ శ్రీ బాలకోటయ్య, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ భాస్కర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.