Singareni: Receipt of Coal Washer Waste Buyer Details Online
ED (Cole Moment) Mr. Alvin, who launched the special application,
GM (Marketing) Mr. K. Suryanarayana, GM (IT) Shri Ram Kumar
Mr. J. Alvin, Executive Director (Coal Moment), Singareni, said that Singareni is always at the forefront of providing cutting-edge technology for the convenience of its customers.
సీఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ సూచనల మేరకు వినియోగదారులకు అందించే సేవలను మరింత సరళతరం చేశారు. మణుగూరు కోల్ వాషరీ, ప్రతిపాదిత జేవీఆర్ ఓసీ(సత్తుపల్లి), నైనీ కోల్ వాషరీ (నైనీ) వ్యర్థాల కొనుగోలు దారులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి వీలుగా రూపొందించిన అప్లికేషన్ ను బుధవారం (హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) శ్రీ ఆల్విన్, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్, కో ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ, జీఎం(ఐటీ) శ్రీ రామ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో జీఎం(కో ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ… జీసీవీ 2200 కిలోక్యాలరీ/ కేజీ కన్నా తక్కువ ఉన్న వ్యర్థాలను ఎన్విరాన్మెంట్ (ప్రొటెక్షన్) రెండో సవరణ నియామావళి-2021 కి లోబడి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్వహిస్తున్న వినియోగదారులకు విక్రయించనున్నట్లు తెలిపారు.

సింగరేణిలోని కోల్ వాషరీలో వివిధ గ్రేడ్ల బొగ్గు వ్యర్థాలు ఎంత మొత్తంలో అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా సమగ్రంగా తెలుసుకోవడానికి, తద్వారా తమకు అవసరమైన మేరకు కొనుగోలుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఆయా కోల్ వాషరీల వద్ద అందుబాటులో ఉన్న రవాణా సదుపాయం వివరాలు తెలుసుకొనే వెసులుబాటు ఉందని వివరించారు. ఔత్సాహిక వినియోగదారులు సింగరేణి కార్యాలయాలను సందర్శించకుండా నేరుగా https://scclmines.com/ వెబ్సైట్ లో వివరాలను నమోదు చేసుకుంటే సరిపోతుందని వివరించారు.
విద్యుతేతర రంగం(నాన్ పవర్ సెక్టర్) వినియోగదారుల నుంచి బొగ్గు కొనుగోలు దరఖాస్తుల ను ఆన్ లైన్ లో స్వీకరించడానికి కూడా ఇటీవలే ప్రత్యేక అప్లికేషన్ను రూపొందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తక్కువ సమయంలో అప్లికేషన్ ను రూపొందించిన ఐటీ విభాగం అధికారులను అభినందించారు.
కార్యక్రమంలో డీజీఎంలు శ్రీ ఎన్.వి.రాజశేఖర్, శ్రీ సత్తు సంజయ్, శ్రీ మారపెల్లి వెంకటేశ్వర్లు, ఎస్.ఓ.ఎం. శ్రీ సురేంద్ర రాజు, డిప్యూటీ మేనేజర్ శ్రీ మహేందర్ రెడ్డి, సీనియర్ ప్రోగ్రామర్ శ్రీమతి షర్మిలా మోజెస్ తదితరులు పాల్గొన్నారు.