Take a fresh look at your lifestyle.

నేటి నుంచి పొరుగు సేవల ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌

  • 23వ తేదీ నుంచి ఉద్యోగులకు రెండో విడత వ్యాక్సిన్‌
  • కరోనాపై సమీక్ష లో డైరెక్టర్లు శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, శ్రీ ఎన్‌.బలరామ్‌ వెల్లడి

సింగరేణిలో పనిచేస్తున్న పొరుగు సేవల (ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే) ఉద్యోగులందరికీ కరోనా నుంచి రక్షణ కోసం ఈ నెల 11వ తేదీ (బుధవారం) నుంచి వ్యాక్సిన్‌ వేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పర్సనల్‌) శ్రీ ఎన్‌.బలరామ్‌ చెప్పారు. పొరుగు సేవల ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. సింగరేణిలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై మంగళవారం (ఆగస్టు 10వ తేదీ) నాడు హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి డైరెక్టర్లు శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, శ్రీ ఎన్‌.బలరామ్‌ అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్ల తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణిలో పొరుగు సేవల ఉద్యోగులకు కూడా వ్యాక్సినేషన్‌ కోసం వ్యాక్సిన్లు కేటాయించాలన్న సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఎన్‌.శ్రీధర్‌ అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వ్యాక్సిన్లు మంజూరు చేసిందని డైరెక్టర్లు శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, శ్రీ ఎన్‌.బలరామ్‌ తెలిపారు.

Midle of the post

ఈ నేపథ్యంలో పొరుగు సేవల ఉద్యోగులకు బుధవారం నుంచి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ కు కంపెనీ ఆసుపత్రులలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లను ఆదేశించారు. అలాగే కంపెనీ ఉద్యోగులందరికీ ఈ నెల 23వ తేదీ నుంచి కరోనా రెండో డోసు వ్యాక్సిన్‌ ను ఇవ్వనున్నట్లు, ఈ నెల 29వ తేదీ మెగా వ్యాక్సినేషన్‌ ను కూడా నిర్వహించి రెండో డోసు వ్యాక్సినేషన్‌ ను పూర్తి చేయనున్నట్లు వివరించారు. జనరల్‌ మేనేజర్‌ (కో ఆర్డినేషన్‌, మార్కెటింగ్‌) శ్రీ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ పొరుగు సేవల ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణ కు వ్యాక్సినేషన్‌ తో పాటు స్వీయ జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించేలా అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. పొరుగు సేవల ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ముగిసిన తర్వాత సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్‌ కు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడిరచారు.

నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి: డైరెక్టర్లు శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, శ్రీ ఎన్‌.బలరామ్‌సమావేశంలో డైరెక్టర్లు శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, శ్రీ ఎన్‌.బలరామ్‌ మాట్లాడుతూ.. ఆగస్టు మాసంలో వర్షాలు అంతగా లేనందున నిర్దేశించుకున్న రోజువారీ 1.85 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తిని తప్పనిసరిగా సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న 700 లక్షల టన్నుల సాధనలో ప్రతీ క్షణం విలువైనదేనన్నారు. ఏరియాలో ఉత్పత్తి, రవాణా లక్ష్యాల సాధన లో ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి జీఎం(పర్సనల్‌) శ్రీ ఎ.ఆనందరావు, డాక్టర్‌ బాలకోటయ్య, డాక్టర్‌ పూర్ణచందర్‌ రావు, కొత్తగూడెం నుంచి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీ మంథా శ్రీనివాస్‌, అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లు, అన్ని ఏరియాల మెడికల్‌ విభాగం అధిపతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.