Singareni: Fastest Compassionate Recruitment Process: GM K. Suryanarayana
Employed heirs must perform duties with disciplinary and protective standards
కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను సింగరేణి సంస్థ అత్యంత వేగవంతంగా మరియు పారదర్శకంగా నిర్వహిస్తోందని, ఇప్పటి వరకు సుమారు 12 వేల మందికి పైగా వారసులకు ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగం పొందిన వారసులు క్రమ శిక్షణ, రక్షణ తో పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ అన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీ కోసూరి సుదర్శన్ కుమారుడు కోసూరి ద్రోణకు శుక్రవారం (మార్చి 11వ తేదీ) నాడు జీఎం శ్రీ కె.సూర్యనారాయణ కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు. నూతనంగా ఉద్యోగం పొందిన యువ కార్మికులు సేఫ్టీ నిబంధనలను పాటించాలని, తద్వారా రక్షణ తో కూడిన ఉత్పత్తి లో భాగస్వాములు కావాలని, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ మార్గనిర్దేశంలో సింగరేణి లో కారుణ్య నియామకాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. విధుల్లోకి చేరుతున్న యువ ఉద్యోగులందరూ కంపెనీ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు, సీనియర్ కార్మికుల సలహాలను పాటిస్తూ గనిలో సేఫ్టీ ప్రమాణాలను పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగరేణిని ప్రమాద రహిత సంస్థగా మార్చడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఎన్.భాస్కర్, చీఫ్ లైజన్ ఆఫీసర్ శ్రీ బి.మహేశ్, అడిషనల్ మేనేజర్ శ్రీ డి.వెంకటేశం, ఎస్‌ఈ శ్రీ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.