Take a fresh look at your lifestyle.

Singareni celebrates Women’s Day: Better community building is in her hands: GM Suryanarayana

She is a sacrificial woman who dedicates her life to the upliftment of the family

GM (Coordination) Shri K. Suryanarayana at the Women’s Day celebrations at Singareni Bhavan

మ‌హిళ‌లు త‌మ వ్య‌క్తిగ‌త సంతోషాల క‌న్నా కుటుంబ స‌భ్యుల ఆనంద‌మే మిన్న‌గా భావిస్తార‌ని,  కుటుంబ ఉన్న‌తే త‌మ పురోగ‌తి అన్న సంక‌ల్పంతో త‌మ జీవితాల‌ను త్యాగం చేసే గొప్ప స‌హ‌న‌శీలి మ‌హిళ అని జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (కో ఆర్డినేష‌న్) శ్రీ కె.సూర్య‌నారాయ‌ణ కొనియాడారు. ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో అన్ని రంగాల్లోనూ పురుషుల‌తో స‌మానంగా  అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ విజ‌య ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్న‌ప్ప‌టికీ కుటుంబానికి కూడా  స‌మ ప్రాధాన్య‌త ఇస్తూ ప్ర‌పంచానికి భార‌తీయ కుటుంబ వ్య‌వ‌స్థ గొప్ప‌త‌నాన్ని చాటుతున్నార‌ని పేర్కొన్నారు.

హైద‌రాబాద్ సింగ‌రేణి భ‌వ‌న్ లో ఈ రోజు నిర్వ‌హించిన‌ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న ముఖ్య అతిథిగా మాట్లాడారు. భార‌తీయ సంస్కృతిలో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని,  ఆడ‌వారిని గౌర‌వించ‌డం ఇంటినుండే మొద‌లుకావాల‌ని అప్పుడే స‌మాజం మొత్తం గౌర‌విస్తుంద‌ని అన్నారు. ప్ర‌తి కుటుంబంలో త‌ల్లి త‌మ కుమారుల‌కు మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం నేర్పాల‌ని, అమ్మ చెబితే ఎవ‌రైనా వింటార‌ని అన్నారు. స్త్రీని త‌ల్లిగా భావిస్తే స‌మాజంలో మ‌హిళ‌ల‌పై ఎలాంటి అకృత్యాలు చోటు చేసుకోవ‌న్నారు.

కార్య‌క్ర‌మంలో జీఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్‌) శ్రీ జి.సురేంద‌ర్ మాట్లాడుతూ..   అమ్మ‌గా, చెల్లిగా, ఆలిగా, స్నేహితురాలిగా మ‌హిళ‌లు మ‌న జీవితాల్లో వెలుగులు నింపుతున్నార‌ని, వారిని గౌర‌వించుకోవ‌డం బాధ్య‌త అన్నారు. వారి ప‌ట్ల వివ‌క్ష‌ను విడ‌నాడాల‌ని కోరారు.

కార్య‌క్ర‌మంలో బొగ్గు గ‌ని అధికారుల సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ ఎన్‌.వి.రాజ‌శేఖ‌ర్ రావు మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలోనూ మ‌హిళ‌లు త‌మ స‌త్తా చాటుతున్నార‌ని, దేశ ఆర్థికాభివృద్ధి లో మ‌హిళా మేధోశ‌క్తి ఎంతో దోహ‌ద‌ప‌డుతుందని కొనియాడారు.

లా మేనేజ‌ర్ శ్రీమ‌తి శిరీషా రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది మ‌హిళా దినోత్స‌వాన్ని లింగ స‌మాన‌త్వం సాధించాల‌న్న ఇతివృత్తంతో జ‌రుపుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.  మ‌హిళ‌ల ఎదుగుద‌ల‌కు ప్రోత్సాహం అందిస్తే అద్భుత విజ‌యాల‌ను న‌మోదు చేస్తుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో శ్రీ‌మ‌తి గుడిపాటి సులోచ‌న సురేంద‌ర్‌, సీనియ‌ర్ ప్రోగ్రామ‌ర్ శ్రీమ‌తి ష‌ర్మిలా మోజెస్, సీనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్ శ్రీ‌మతి ల‌క్ష్మీ ప్రియ త‌దిత‌రులు మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు అంద‌రినీ అల‌రించాయి.  మ‌హిళా దినోత్స‌వం నేప‌థ్యంలో వివిధ అంశాల్లో నిర్వ‌హించిన పోటీల్లో విజేత‌ల‌కు జీఎం(కో ఆర్డినేష‌న్‌) శ్రీ కె.సూర్యనారాయ‌ణ చేతుల మీదుగా బ‌హుమ‌తి ప్ర‌దానం జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా శ్రీ‌మ‌తి శార‌ద వ్య‌వ‌హ‌రించ‌గా, సీనియ‌ర్ క‌మ్యూనికేష‌న్ అధికారి శ్రీ గ‌ణాశంక‌ర్ పూజారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. కార్య‌క్ర‌మంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ శ్రీ ఎన్‌.భాస్క‌ర్‌, వివిధ విభాగాల అధిప‌తులు, అధికారులు, ఉద్యోగులు, పెద్ద సంఖ్య‌లో మ‌హిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

If you're looking for a fun and exciting new casino destination, look no further than Pin Up Casino India! Our online casino https://pinupcasino-india.in offers players a wide range of games to choose from, as well as some great bonus offers. We know that Indian players are looking for the best online gaming experience, and we are committed to providing just that! So come join us at Pin Up Casino India today and see what all the fuss is about!