Take a fresh look at your lifestyle.

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రాబోతున్న చిత్రాలు ఇవే!

  • మార్చి 25న విడుదలవుతున్న ‘ఆర్ఆర్ఆర్’
  • మార్చి 25 నుంచి ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న ‘భీమ్లా నాయక్’
  • మార్చి 25న జీ5లో విడుదలవుతున్న ‘వలిమై’
ఈ వారం సినిమా థియేటర్లు, ఓటీటీలు మోత మోగనున్నాయి. భారీ చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ వారమే విడుదలవుతోంది. దాదాపు రూ. 400 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వెసులుబాటును కల్పించిన సంగతి తెలిసిందే. 
ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న చిత్రాలు ఇవే:
ఆర్ఆర్ఆర్: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు:
భీమ్లా నాయక్: పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలయింది. త్రివిక్రమ్ సంభాషణలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సాగర్ కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 25 నుంచి ఈ చిత్రం ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో విడుదల కాబోతోంది.

వలిమై: తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వలిమై’ ఫిబ్రవరి 24 విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో కార్తికేయ నెగెటివ్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం మార్చి 25న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Leave A Reply

Your email address will not be published.

If you're looking for a fun and exciting new casino destination, look no further than Pin Up Casino India! Our online casino https://pinupcasino-india.in offers players a wide range of games to choose from, as well as some great bonus offers. We know that Indian players are looking for the best online gaming experience, and we are committed to providing just that! So come join us at Pin Up Casino India today and see what all the fuss is about!