‘Ugadi’ should fill the Singareni workers with joy
GM K. Suryanarayana at the Ugadi celebrations at Singareni Bhavan
ఉగాది సింగరేణీయుల్లో ఆనందాలు నింపాలి: సింగరేణి భవన్ లో ఉగాది సంబురాల్లో జీఎం కె.సూర్యనారాయణ
శుభకృత్ నామ సంవత్సరం ప్రతీ ఒక్క సింగరేణీయుడి జీవితంలో ఆనందాలు నింపాలని, వారు వ్యక్తిగత జీవితాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను, అలాగే కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాధించేలా చూడాలని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ ఆకాంక్షించారు.

శనివారం (ఏప్రిల్ 4, 2022) సింగరేణి భవన్ లో నిర్వహించిన ఉగాది సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ మార్గనిర్దేశంలో డైరెక్టర్ల పర్యవేక్షణలో గత ఆర్థిక (2021-22) సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 65 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించామని తెలిపారు. ఈ ఏడాది సంస్థ నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలకు ప్రతీ ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని కోరారు.
సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో కరోనా సమయంలో తీసుకున్న నివారణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, సింగరేణీయుల విలువైన ప్రాణాలను కాపాడుకోగలిగామన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల సమయంలో సింగరేణి భవన్ లో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు చక్కటి సమన్వయంతో పనిచేసి ఏరియాలకు కావాల్సిన వైద్య సామగ్రిని, మెడికల్ కిట్లను సరైన సమయంలో పంపిణీ చేశారని, మెడికల్ రెఫరల్ కేసులకు హైదరాబాద్ లోని కార్పోరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా చూశారని అభినందించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ ఉగాది సందేశాన్ని చదివి వినిపించారు. ఉగాది సంబురాల్లో భాగంగా ఉద్యోగులందరికీ అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఎన్.భాస్కర్, అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.