6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిన కేసీఆర్

 

ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్  రావు గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. 630 ఎకరాల్లో అభివృద్ది చేసిన నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్  పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నర్సాపూర్ అడవుల్లో చేపట్టిన అటవీ అడవి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.

                                       CM KCR Launched 6th phase Harithaharam at Narsapur
అటవీ ప్రాంతంలో కాలి నడకన తిరుగుతూ అడవి పునరద్దరణ కోసం చేపట్టిన చర్యలను పరిశీలించారు. నేచురల్ ఫారెస్ట్, రాక్ ఫిల్ డ్యాం, వాటర్ హార్వెస్టింగ్ తదితర పనులను పరిశీలించారు.  ఎతైన కొండపై నిర్మించిన  వాచ్ టవర్ నుండి ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్నంతా సందర్శించారు.  గోదావరి నదీ పరివాహక ప్రాంతాలయిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అడవి ఉందని, ఆ ప్రాంతం కాక దట్టమైన అడవి వున్న ఎకైక ప్రాంతం రాష్రంత్లో నర్సాపూర్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ అడవిని కాపాడుకోవడానికి, అటవీ ప్రాంతంలో పోయిన అడవిని పునరుద్ధరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షీణించిన అడవిని పునరుద్ధరణ చేస్తామన్నారు. కలప స్మగ్లర్లను అణిచివేస్తామని హెచ్చరించారు.  అటవీశాఖ అధికారులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని సీఎం మెచ్చుకున్నారు.

ఈ  కార్యక్రమంలో మంత్రులు  ఇంద్రకరణ్‌ రెడ్డి, హరీశ్‌రావు, సీఎం కార్యాలయం అధికారులు నర్సింగరావు, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పిసీసీఎఫ్ ఆర్. శోభ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు,  పాల్గొన్నారు.

     KCR  launched  6th phase Harithaharam programme at Narsapur Urban Forest Park today

Chief Minister  K Chandrashekhar Rao launched the sixth phase of Haritha Haram programme on Thursday by planting a Black Plum (Neredu) sapling in the Narsapur forest area in Medak district.

The CM inaugurated the Narsapur Urban Forest Park, which was developed in 636 acres. The CM has personally examined the Forest and Forest revival programme being implemented in Narsapur forest area. The CM went by foot and inspected the forest revival programme works.

He also examined the works related to natural Forest, Rock fill Dam, Water harvesting. From the Watch Tower built on a hill, the CM had the view of the entire forest area. The CM said that forest is there in the river valley regions like combined Khammam, Warangal, Karimnagar and Adilabad districts.

Other than these districts, Narsapur is the only area where there are thick forests. He urged that the more importance should be given to protect the forests and afforestation should be done in the deforested areas.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *