మియావాకి అడవుల అభివృద్ధిలో జల మండలి ముందడుగు…. సక్సెస్ కు సంకేతంగా నిలిచిన మల్లారం ఆకు పచ్చని వనాలు

విస్తీర్ణం త‌క్కువ… మొక్క‌లు‌ ఎక్కువ‌ : మల్లారం నీటి శుద్ది కేంద్రంలో ఇప్ప‌టీకే విజ‌య‌వంతం : హెక్టార్ స్థ‌లంలో దాదాపుగా 10వేల మొక్క‌లు పెంప‌కం : జ‌ల‌మండ‌లిలో 6వ విడ‌త హ‌రిత హారం : మొక్క‌లు నాటిన జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిషోర్

జలమండలి పరిధిలోని అన్ని ఖాళీ ప్రాంతాల్లో మినీ అడవులను అభివృద్ధికి జల మండలి నాంది పలికింది.  త‌క్క‌వ విస్తీర్ణంలో ఎక్కువ మొక్క‌లు పెంచే పర్యావరణ శాస్త్రవేత్త మియావాకీ శాస్త్రీయ పద్ధతిలో మినీ ఆడవులను పెంపకానికి సంకల్పించింది. దీనిలో భాగంగా గ‌త ఏడాది మ‌ల్లారం, కొండ‌పాక మంచినీటి శుద్ది కేంద్రాల్లో ప్ర‌యోగ‌త్మాకంగా చేప‌ట్టిన‌ మియావాకీ ప‌ద్ద‌తుల్లో ఒక హెక్టార్ లో 10 వేల మొక్క‌లు నాటి వాటి సంర‌క్షణకు నడుం బిగించింది. అంతే ఆ ప్రాంతం నేడు ఆకు పచ్చని అడవులతో… అందాలతో కళకళలాడుతున్నాయి మియావాకి పధకం ద్వారా మంచి ఫ‌లితాల‌ను సాధించినట్లు జలమండలి ఎండీ దానకిషోర్ హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషిచేసిన అధికారులకు,సిబ్బందిని ఆయన అభినందించారు. ఇదే తరహాలో మ‌రిన్ని ప్రాంతాల్లో ప‌చ్చ‌ద‌నం పెంపుకు అవసరమైన ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు.‌

జపాన్ కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త అకిరా మియావకీ 1990లోనే శాస్త్రీయ పరిశోధనలో తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ మొక్కలు నాటి మినీ అడవిని అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారని, ఈ పద్ధతి మ‌న‌దేశంలోని నాగపూర్, ముంబాయి, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో విజయవంత‌మైంద‌ని ఎండీ వివ‌రించారు. సాధ్యమైనంత‌ ఎక్కువ మొక్కలను దట్టమైన అడవి మాదిరిగా పెంచడమే మియావాకీ విధానమ‌న్నారు.

అలాగే స్థల కొరత తీవ్రంగా ఉన్నచోట్ల, కాంక్రీట్ అరణ్యాలుగా పారిపోయిన నగరాల్లో స్వచ్ఛమైన గాలి కావాలంటే ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటడానికి ఈ ప‌ద్ద‌తి అనువైంద‌ని తెలిపారు.

మొక్కకూ మొక్కకు కనీసం ఒక్క మీటరు దూరంలో రెండు అడుగుల గొయ్యి తవ్వి సిద్ధం చేసి, అనంతరం ప‌శువుల‌ పేడతోపాటు మొక్కలు ఏపుగా పెరగడానికి అవసరమైన సేంద్రియ ఎరువులను మట్టితో కలిపి మొక్కను నాటి రోజు నీటి పోస్తూ సంర‌క్షించాల‌ని తెలిపారు. మొక్కలను దగ్గరగా నాటినందుకు ఆ ప్రాంతంలో కి అడుగు పెట్టడానికి అవకాశం ఉండదని వివ‌రించారు.

ఈ ఆడవుల పెంపకంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడడంతో పాటు, నగర ప్రజలు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందే వీలుంటుందన్నారు. వర్షపాతం పెరిగి భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, అలాగే ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుందని ఎండీ వివ‌రించారు.

ఈ మినీ అడవిలో రావి, సిస్సు, నేరేడు, జువ్వి, వేప‌, ఇప్ప‌, కానుగ‌, ఉసిరి, ఏరు మద్ది, మారేడు, చింత‌, వెదురు వంటి దాదాపు 14 ర‌కాలకు చెందిన 10వేల మొక్క‌ల‌ను మినీ అడ‌విలో భాగంగా పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పెద్ద‌పూర్ జ‌ల‌మండ‌లి ప్రాంగ‌ణంలో  సైతం మియావాకీ మినీ అడ‌రవుల పెంప‌కానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు.

అలాగే జ‌ల‌మండ‌లి జీఎమ్‌ల‌ను డివిజ‌న్ కార్యాల‌యాలు, రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాల్లోని ఖాళీ ప్రాంతాల్లో మొక్క‌లు పెంప‌కం చేప‌ట్టి, వాటికి జియో ట్యాగింగ్ చేసి సంర‌క్షించాల‌ని ఆదేశించారు.

జలమండలి నగర ప్రజల మంచినీటి అవసరాలను తీర్చుతూ పర్యావరణంకు పెద్ద పీట వేస్తుందని జ‌ల‌మండ‌లి ఎండీ ఎం. దానకిషోర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్రవారం హిమాయత్ సాగర్ లోని జ‌ల‌మండ‌లి గార్డెన్ లో మొక్క‌లు నాటారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్లు అజ్మీరా కృష్ణ, పి.ర‌వి, ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్లు ఎం. ఎల్లాస్వామి, డి. శ్రీధ‌ర్ బాబు, టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ వి. ఎల్. ప్ర‌వీణ్ కుమార్ ల‌తో పాటు ప‌లువురు సీజీఎమ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *