హరితహారంలో ప్రజల భాగస్వామ్యం అవసరం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం  హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్, కేబీఆర్ పార్క్, లుంబిని ఎస్ ఎల్ ఎన్  స్ప్రింగ్స్ గేటెడ్ కమ్యూనిటీల లో అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో  ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పిసీసీఎఫ్ ఆర్. శోభ ,ఎఫ్ డిసి ఎండీ  రఘువీర్  తదితరులు పాల్గొన్నారు.

కాసుబ్ర‌హ్మానంద రెడ్డి (కేబీఆర్) జాతీయ ఉద్యాన‌వ‌నంలో ఆధునీకరణ చేసిన ఎంట్రీ ప్లాజా ను  మంత్రి ప్రారంభించారు. సెన్సార్లతో సందర్శకులకు టచ్ ఫ్రీ ఎంట్రీ, అవుట్ సౌకర్యాన్ని ప్రారంభించారు.  హరితహార కార్యక్రమంలో భాగంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేబీఆర్ పార్కు లో  మొక్కలు నాటారు.

కోవిడ్ -19 ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సందర్శకుల కోసం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎంట్రీ ప్లాజాను ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్ వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.  ఎంట్రీ బ్యారియర్స్ ను మార్చి, కొత్తగా స్వింగ్ బ్యారియర్స్ ను ఏర్పాటు చేసి ఈ సందర్భంగా పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలను మంత్రి వివరించారు. ఓపెనింగ్, క్లోజింగ్ ఎంట్రీ వద్ద  పేషియల్ డిటెక్షన్ అమర్చారు.  ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ర్యాంప్ సౌకర్యం కల్పించారన్నారు.

అర్బన్ ఫారెస్ట్  పార్క్ థీమ్ లాగా ఎంట్రీ ప్లాజా వద్ద   పీకాక్ బేస్డ్  థీమ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సందర్శకులు, వాకర్స్ భద్రతలో భాగంగా పార్క్ అంతటా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా  మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు.   ఇక్కడ ఉన్న జంతువులు, పక్షి జాతుల్లో ఎక్కువగా జాతీయ పక్షి నెమలి ఉండటంతో, కేబీఆర్ జాతీయ ఉద్యానవనం ఏర్పాటుకు గుర్తుగా ప్రతీయేటా నవంబర్ 3న అటవీ శాఖ పీకాక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ పార్కుకు వచ్చే సందర్శకులకు, వాకర్స్ కు నెమళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

కోవిడ్ -19 నేపథ్యంలో గత మూడు నెలలుగా కేబీఆర్ పార్క్ మూసివేయబడి ఉండటంతో సందర్శకుల పాస్ రెన్యూవల్ తేదీని సెప్టెంబర్ వరకు పొడిగిండచడం జరుగుతుందని,  దీనికి ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.  సందర్శకులు తమ పాసులను అక్టోబర్, 2020 నుంచి ఆన్ లైన్ ద్వారా రెన్యూవల్  చేసుకోవచ్చునాని మంత్రి తెలిపారు.

కేబీఆర్ పార్కులో పక్షులకు ఆహారంగా ఉపయోగపడే  రావి, మర్రి, జువ్వి, మేడి జాతి వృక్షాలకు చెందిన 5 వేల విత్తనాలను నాటడంతో పాటు, 5.4 కిలోమీట్లర మేర రోడ్డును పూర్తిగా  పుననిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా  ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని,ఈ కార్యక్రమంలో  అందరూ పాల్గొని తప్పనిసరిగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను పరిరక్షించాలని మంత్రి పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, PCCF శోభ,అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్,  పర్గెన్, చంద్రశేఖర్ రెడ్డి, డీ ఎఫ్ వోలు భీమనాయక్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *