Take a fresh look at your lifestyle.

AP : పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ: సీఎం జగన్

0 9

 

 

పారిశ్రామిక ప్రమాదాలను నివారణకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ సేఫ్టీపై క్యాంపు కార్యాలయంలోఈ రోజు  అధికారులతో ఆయన సమీక్షించారు. . పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న  రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు  వస్తాయని దీని దృష్ట్యా సేఫ్టీ పాలసీని అమలుకు  అధికారులు ప్రతిపాదించారు.  ఏడాదికి రెండు సార్లు కాంప్లియన్స్‌ నివేదికలు కోరుతున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడుతున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు.   ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగంతో పాటు  థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా ఇతర అధికారులు హాజరు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తున్నామని, స్పెషల్‌డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోందని అధికారులు వెల్లదించారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తిచేస్తామని, పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై సమావేశంలో విస్తృత చర్చజరిగింది.

కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని  అధికారులు ప్రతిపాదించగా  పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ కూడా ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావాలని, అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులను వీటన్నింటినీ సూచిస్తూ ఇండస్ట్రియల్‌ అట్లాస్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారు.  ఎలాంటి పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్నదానిపై ఈ అట్లాసులో వివరాలు పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నదానిపై ఈ అట్లాస్‌ ద్వారా వివరాలు పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని  సీఎం కోరారు.

విశాఖకు వీడని గ్రహణం : విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు

వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై పెట్టాలి: సీఎంథర్డ్‌పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలన్నారు.  పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి: విశాఖ గ్యాస్‌ దుర్ఘటనలో ఇన్‌హెబిటర్స్‌ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు: ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈసమస్య వచ్చింది: అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారని,  మన దగ్గర ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని అసంతుప్తి వ్యక్తం చేశారు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినం ఉండాల ని  పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని,:ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా విధానంలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.