Take a fresh look at your lifestyle.

TS : శాంతి భద్రతలు, కలప స్మగ్లింగ్ పై పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ కానున్నసీఎం కేసీఆర్

0 22

రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వాహణతో పాటు అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతిభవన్ లో పోలీసు ఉన్నతాధికారుల విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో  విస్తృతంగా చర్చించనున్నారు. అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు.

హోం, అటవీ శాఖ మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డి.జి.పి, అడిషనల్ డి.జి.పిలు, పిసీసీఎఫ్ ఆర్. శోభ , ఐ.జీలు, డి.ఐ.జీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Leave A Reply

Your email address will not be published.